IPL 2026: అన్ని జట్ల రిలీజ్ లిస్టు ఇదిగో.. డమ్మీగా ముంబై.. దుమ్మురేపుతున్న కేకేఆర్.? ఎందులోనంటే.?

టైటిల్ చూసి షాక్ అవ్వొద్దు.. వచ్చే మినీ వేలంలోకి ముంబై ఇండియన్స్ డమ్మీగా బరిలోకి దిగబోతోంది. అటు కేకేఆర్ మొత్తం ప్లేయర్స్ ను విడుదల చేసి.. తమ టీంను బలోపేతం చేయనుంది. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఇందులో తెలుసుకుందామా మరి.

IPL 2026: అన్ని జట్ల రిలీజ్ లిస్టు ఇదిగో.. డమ్మీగా ముంబై.. దుమ్మురేపుతున్న కేకేఆర్.? ఎందులోనంటే.?
Ipl 2026

Updated on: Nov 15, 2025 | 6:21 PM

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిలీజ్ జాబితాల లిస్టును ప్రకటించేశాయి ఫ్రాంచైజీలు. చాలావరకు ప్రతీ జట్టు తమ కోర్ టీంపై భరోసా ఉంచి రిటైన్ చేసుకోగా.. పలు సంచలన ఆటగాళ్లు మినీ వేలంలోకి రానున్నారు. హైదరాబాద్ మళ్లీ తమ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్లకే ఓటు వేసింది. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ కూడా తమ కోర్ టీంను అట్టిపెట్టుకుంది. మరి ఫ్రాంచైజీలు ఎవరెవరిని రిలీజ్ చేశారు. పర్స్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..

IPL 2026 ఫ్రాంచైజీల వారీగా రిలీజ్, ట్రేడ్ లిస్టు జాబితా:

ఢిల్లీ క్యాపిటల్స్: మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, సెడికుల్లా అటల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే

గుజరాత్ టైటాన్స్: గెరాల్డ్ కోయెట్జీ, కరీం జనత్, మహిపాల్ లోమ్రోర్, దసున్ షనక, కుల్వంత్ ఖేజ్రోలియా

ముంబై ఇండియన్స్: కర్ణ శర్మ, బెవోన్ జాకబ్స్, ముజీబ్ ఉర్ రెహమాన్, విఘ్నేష్ పుత్తూర్, KL శ్రీజిత్, PSN రాజు, రీస్ టోప్లీ, లిజాద్ విలియమ్స్, అర్జున్ టెండూల్కర్(LSGకి ట్రేడ్)

చెన్నై సూపర్ కింగ్స్: రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, కమలేష్ నాగర్‌కోటి, ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, వంశ్ బేడి, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మతీషా పతిరానా, రవీంద్ర జడేజా(ట్రేడ్ టూ ఆర్ఆర్), సామ్ కర్రన్(RR ట్రేడ్)

సన్‌రైజర్స్ హైదరాబాద్: రాహుల్ చాహర్, సిమర్జీత్ సింగ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అథర్వ తైదే, వియాన్ ముల్డర్, మహ్మద్ షమీ(LSGకి ట్రేడ్)

కోల్ కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, లువ్నిత్ సిసోడియా, చేతన్ సకారియా, ఆండ్రీ రస్సెల్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, మొయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండే(MIకి ట్రేడ్)

లక్నో సూపర్ జెయింట్స్: రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, ఆర్యన్ జుయల్(WK), యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డేవిడ్ మిల్లర్, షమర్ జోసెఫ్, శార్దూల్ ఠాకూర్(ముంబైకి ట్రేడ్)

పంజాబ్ కింగ్స్: గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీ, కైల్ జామీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే

రాజస్థాన్ రాయల్స్: కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, కునాల్ సింగ్ రాథోడ్, అశోక్ శర్మ, వనిందు హసరంగా, ఫజల్హాక్ ఫరూకీ, మహేశ్ తీక్షణ, సంజు శాంసన్(CSKకి ట్రేడ్), నితీష్ రాణా(DCకి ట్రేడ్)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: లియామ్ లివింగ్‌స్టోన్, లుంగి ఎన్‌గిడి, మయాంక్ అగర్వాల్, స్వస్తిక్ చికారా, మనోజ్ భాండాగే, మోహిత్ రాతీ

IPL 2026 పర్స్ అప్ డేట్స్:

సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 25.5 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 16.4 కోట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 64.3 కోట్లు

ముంబై ఇండియన్స్: రూ. 2.75 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్: రూ. 43.4 కోట్లు

గుజరాత్ టైటాన్స్: రూ. 12.9 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్: రూ. 22.95 కోట్లు

పంజాబ్ కింగ్స్: రూ. 11.5 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 21.8 కోట్లు

రాజస్థాన్ రాయల్స్: రూ. 16.05 కోట్లు