
ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు, జట్ల ప్రదర్శనను బట్టి ప్లేఆఫ్స్ చేరే వాటిపై విశ్లేషకులు ముందస్తు అంచనాలను వెల్లడించారు. ఈ సీజన్‌లో కొన్ని జట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండగా, మరికొన్ని జట్లు బలమైన పోటీనిస్తున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్(CSK), గుజరాత్ టైటాన్స్ (GT), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరుసగా మూడు ఓటములతో చెన్నై జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్నా ఫామ్ లేమితో పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే, భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కీలక ఆటగాడు విఫలం కావడం, స్పిన్ విభాగం బలహీనపడటం ఆ జట్టును కష్టాల్లోకి నెట్టింది.
ఇది చదవండి: రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20 డబుల్ సెంచరీ.. కొట్టింది ఎవరో కాదు మనోడే
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్ల పరిస్థితి ప్రస్తుతం అస్థిరంగా ఉంది. ఈ జట్లు కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడుతున్నాయని, బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తేనే వీరు మ్యాచ్‌లు గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ రెండు జట్లు స్థిరమైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్ రేసులో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు 70 నుంచి 80 శాతం అవకాశాలతో బలంగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, ఆ జట్టులోని బ్యాటింగ్, బౌలింగ్ సమతూకం వారిని మళ్ళీ గెలుపు బాట పట్టించేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం బాగానే ఆడుతున్నా, సమీర్ రిజ్విపైనే అతిగా ఆధారపడటం ఆ జట్టుకు బలహీనతగా మారింది. కీలక మ్యాచుల్లో మిగతా ఆటగాళ్లు రాణించకపోతే ఢిల్లీకి ముప్పు తప్పదు. మొత్తానికి ముంబై, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ జట్లు ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకునే ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నాయి.
ఇది చదవండి: రెండు మ్యాచ్‌లు.. రెండు మోసాలు.. కాటేరమ్మ కొడుకులపై పగ పట్టేశారుగా.!