IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భారత్ నుంచి తరలనున్న ఐపీఎల్.. ఎందుకంటే?

IPL 2026 schedule: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం మధ్యప్రాచ్యంలో పెరగడంతో భారత్‌లో ఎల్పీజీ, గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు ఐపీఎల్ నిర్వహణపై ప్రభావం చూపుతాయా అనే చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే బీసీసీఐ మాత్రం పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భారత్ నుంచి తరలనున్న ఐపీఎల్.. ఎందుకంటే?
Ipl2026 War Effect

Updated on: Mar 11, 2026 | 1:18 PM

USA Iran War Impact IPL: ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ 2026 ఈసారి కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. దీని కారణంగా భారత్‌లో ఎల్పీజీ, గ్యాస్ సరఫరాలో కొంత కొరత ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్ నిర్వహణలో లాజిస్టిక్ సమస్యలను సృష్టించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

పరిస్థితులను పరిశీలిస్తున్న బీసీసీఐ..

ఈ పరిణామాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను బీసీసీఐ, ఇతర సంబంధిత భాగస్వాములు దగ్గరగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. “ప్రస్తుతం పరిస్థితి మారుతూ ఉంది. అందుకే ఇప్పుడే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. పరిస్థితులు ఎలా మారుతాయో పరిశీలించి అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటాము,” అని అరుణ్ ధుమాల్ తెలిపారు.

ఎక్కువమంది చదివినది: టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

ఐపీఎల్ భారత్ బయటకు వెళ్తుందా?

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026ను భారత్ బయటకు మార్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. కొత్త సీజన్ ప్రారంభానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో వేదిక మార్చడం కష్టం.

ఇకపోతే గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి యూఏఈను ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగించారు. కానీ ప్రస్తుతం మధ్యప్రాచ్యంలోనే యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నందున యూఏఈ కూడా సరైన ఎంపికగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఈసారి పూర్తిగా భారత్‌లోనే నిర్వహించే అవకాశమే ఎక్కువగా ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

మార్చి 12న ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన..

ఈ పరిస్థితుల మధ్య కూడా బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌పై కీలక ప్రకటన చేసింది. బీసీసీఐ కార్యదర్శి ప్రకారం ఐపీఎల్ 2026 షెడ్యూల్ మార్చి 12న ప్రకటించబడుతుంది. మొదటగా తొలి 20 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేస్తారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us