IPL 2026 : ఐపీఎల్ 2026 కొత్త రూల్స్..స్టేడియంలో ఆటగాళ్లకు ఫుల్ రిస్ట్రిక్షన్స్.. ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేశారుగా

IPL 2026 : ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రకటించింది. మ్యాచ్ రోజు ప్రాక్టీస్ బ్యాన్, డ్రెస్ కోడ్ ఆంక్షలు, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేక నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కొత్త గైడ్‌లైన్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని బోర్డు హెచ్చరించింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 కొత్త రూల్స్..స్టేడియంలో ఆటగాళ్లకు ఫుల్ రిస్ట్రిక్షన్స్.. ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేశారుగా
Ipl Trophy

Updated on: Mar 24, 2026 | 5:39 PM

IPL 2026 : మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ సరికొత్త నిబంధనలను సిద్ధం చేసింది. క్రమశిక్షణ, బ్రాడ్ కాస్టింగ్ క్వాలిటీ, ఆటగాళ్ల వృత్తి నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కఠిన రూల్స్ తీసుకొచ్చారు. కేవలం ప్రాక్టీస్ సెషన్లకే కాకుండా, డ్రెస్ కోడ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ కొత్త గైడ్‌లైన్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని బోర్డు హెచ్చరించింది.

ప్రాక్టీస్ సెషన్లపై కఠిన ఆంక్షలు

బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై మ్యాచ్ జరిగే రోజున స్టేడియంలో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్లు ఉండవు. ప్రధాన మైదానంలో ప్రాక్టీస్ లేదా ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించడానికి అనుమతి లేదు. ప్రాక్టీస్ రోజుల్లో ప్రతి జట్టుకు కేవలం 2 నెట్స్ మాత్రమే కేటాయిస్తారు. ఒక జట్టు తన ప్రాక్టీస్‌ను ముందుగానే ముగించినప్పటికీ, మిగిలిపోయిన సమయాన్ని మరో జట్టు వాడుకోవడానికి వీలు లేదు. అలాగే ఓపెన్ నెట్స్ ప్రాక్టీస్‌పై కూడా బోర్డు నిషేధం విధించింది.

కుటుంబ సభ్యుల ప్రయాణంపై కొత్త రూల్

ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన బాధ్యతల మధ్య స్పష్టమైన తేడా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రాక్టీస్ రోజుల్లో ఆటగాళ్లు తప్పనిసరిగా జట్టు బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు జట్టు బస్సులో ప్రయాణించడానికి అనుమతి లేదు. వారు వేరే వాహనాల్లో మైదానానికి రావచ్చు, కానీ డ్రెస్సింగ్ రూమ్ లేదా ఫీల్డ్‌లోకి మాత్రం ప్రవేశించకూడదు. కేవలం హాస్పిటాలిటీ ఏరియా నుంచి మాత్రమే ప్రాక్టీస్‌ను చూడాల్సి ఉంటుంది.

ప్రెజెంటేషన్, డ్రెస్ కోడ్ నిబంధనలు

మ్యాచు ముగిసిన తర్వాత జరిగే బహుమతి ప్రదానోత్సవం విషయంలో బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇకపై ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు, ఫ్లాప్పీ హ్యాట్స్ లేదా స్లిప్పర్లు వేసుకుని ప్రెజెంటేషన్‌కు రాకూడదు. ఈ నిబంధనను మొదటిసారి అతిక్రమిస్తే హెచ్చరిక జారీ చేస్తారు, రెండోసారి కూడా రిపీట్ అయితే భారీ నగదు జరిమానా విధిస్తారు. అలాగే, జెర్సీ నంబర్లు మార్చుకోవాలనుకుంటే 24 గంటల ముందే బీసీసీఐకి సమాచారం ఇవ్వడం తప్పనిసరి.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రూల్

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కలిగి ఉన్న ఆటగాళ్లు, మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కనీసం మొదటి 2 ఓవర్ల పాటు ఆ క్యాప్‌లను ధరించడం తప్పనిసరి. బ్రాడ్‌కాస్టర్లు వారిని కెమెరాల్లో బంధించేలా చూడటం కోసమే ఈ నిబంధన తెచ్చారు. వీటితో పాటు మైదానంలోని ఎల్‌ఈడీ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులపై బంతులు కొట్టకుండా జాగ్రత్త పడాలని, వాటి ముందు కూర్చోకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us