
ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ పరుగుల వరద పారించారు. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేశారు. ఇక లక్నో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సెంచరీతో చెలరేగిపోయాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లులో 117 పరుగులు సాధించాడు. ఇక ఓపేనర్లుగా బరిలోకి దిగన మార్క్‌రమ్, మిచెల్ మార్ష్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. పవర్‌ప్లేలో దూకుడుగా రాణించిన వీరిద్దరూ భాగస్వాయ్యంలో 91 పరుగుల సాధించారు. ఈ క్రమంలో గుజరాత్ బౌలర్ సాయి కిశోర్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చిన మార్క్‌రమ్ 24 బంతుల్లో 36 పరుగులు సాధించింది వెనుతిరిగాడు.
తనకు తోడుగా ఉన్న మార్కరమ్ వెనుతిరిగా మిచెల్ మార్ష్ మాత్రం వెనక్కి తగ్గలేదు గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో లక్నో స్కోర్ బోర్డు అమాంతం పైకి లేచింది. తర్వాత వచ్చిన నికోలస్ పురాన్‌తో కలిసి రాణించిన మార్ష్ కేవలం 64 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 పరుగులు సాధించి. తన ఖాతాలో మరో సెంచరీని వేసుకున్నాడు. ఇక 19వ ఓవర్లో, అర్షద్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు ఆ బంతిని క్యాట్ పట్టి మార్ష్‌ను ఔట్ చేశాడు. దీంతో విచేట్ మార్ష్ వెనుతిరిగాడు.
మార్ష్ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ సైతం దూకుడుగా ఆడాడు. కేవతం 6 బంతుల్లోనే 16 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడుతూ 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో స్కోరు 235కు చేరింది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిశోర్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీయగా, మిగతా బౌలర్లందరూ భారీగా సమర్పించుకున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..