ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌తో గ్రాండ్‌గా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ శక్తివంతమైన ఆరంభాన్ని అందుకుని, మొదటి 10 ఓవర్లలో 107 పరుగులు చేయగలిగింది. అయితే, ఆ తర్వాత RCB బౌలర్లదే హవా కొనసాగింది. ఫలితంగా KKR 20 ఓవర్లలో 174/8కే పరిమితమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒక హాస్యాస్పద సంఘటన చోటు చేసుకుంది. IPL 2025 ప్రసారకర్తలు విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తున్నట్టు చూపించడంతో , అసలు బౌలర్ అయిన జోష్ హాజిల్‌వుడ్ కంటే ఎక్కువగా కోహ్లీ స్క్రీన్ పై కనిపించడంతో ప్రేక్షకులు నవ్వడం ఆపలేకపోయారు. ఈ బ్రాడ్‌కాస్టింగ్‌లో జరిగిన తప్పిదాన్ని నెట్టింట తీవ్రంగా ట్రోల్ చేశారు.
ఇక మొడటి పోరులో ఆర్‌సిబి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన అజేయ అర్ధసెంచరీతో మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించాడు. ఛేజింగ్‌లో అతనికి ఫిల్ సాల్ట్ అద్భుతమైన సహకారం అందించాడు. తన మాజీ జట్టుపై సాల్ట్ కేవలం 31 బంతుల్లో 56 పరుగులు చేసి పేలుడు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీతో కలిసి 95 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయానికి బలమైన పునాది వేసాడు. కోహ్లీ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి 36 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆర్‌సిబి 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ అర్ధసెంచరీ చేసిన కొద్దిసేపటికే మైదానంలో ఒక అభిమాని ప్రవేశించి కోహ్లీ పాదాలపై పడి భక్తిని చాటుకోవడం విశేషం.
తొమ్మిదో ఓవర్లో సాల్ట్ అవుట్ అయినప్పటికీ, కోహ్లీ తన దూకుడు తగ్గించలేదు. లెగ్ స్పిన్నర్ చక్రవర్తిపై స్లాగ్-స్వీప్ చేసి, తన బ్యాట్‌ను ఎత్తి డగౌట్ వైపు చూపించాడు. ఈ ప్రక్రియలో కోహ్లీ ఐపీఎల్‌లో కెకెఆర్‌పై 1000 పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేసి, కోహ్లీతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
కెకెఆర్ బ్యాటింగ్‌లో సునీల్ నారాయణ్ 26 బంతుల్లో 44 పరుగులు చేసి, రహానే (56)తో కలిసి మూడో వికెట్ కోసం 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ ఆ జోరును కృనాల్ పాండ్యా తన 3/29 సంఘటనతో అడ్డుకున్నాడు. అతను మధ్యలో ఓవర్ రహానే, వెంకటేష్ అయ్యర్ (6), రింకు సింగ్ (12)లను అవుట్ చేసి కెకెఆర్‌ను 200 పరుగులు దాటకుండా అడ్డుకున్నాడు.
IPL 2025 SCORECARD GRAPHICS. 📊
But why is Kohli shown as a bowler in the graphics? 🤔😂 #IPL2025 #ViratKohli pic.twitter.com/ExA8MiVGlz
— ICC Asia Cricket (@ICCAsiaCricket) March 22, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..