
ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉంటారు. క్వాలిఫైయర్ 1 ఆడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ తమ బ్యాటింగ్ విశ్వరూపం చూపించింది. మంగళవారం లక్నో వేదిక లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 228 పరుగుల టార్గెట్‌ను ఛేదించి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్‌తో క్వాలిఫైయర్ 1 ఆడేందుకు రెడీ అయిపోయింది. ఇంత కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ స్కోర్ చూసి.. చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అబ్బా.. పెద్ద స్కోరే ఉంది మ్యాచ్ కష్టమే అనుకున్నారు. పైగా ఈ సీజన్‌లో పెద్దగా ఆడని లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ సెంచరీతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మిచెల్ మార్ష్ సైతం 37 బంతుల్లో 67 పరుగులు చేసి రాణించాడు. దీంతో లక్నో ఆర్సీబీ ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఎలాగైనా గెలవాలనే కసితో దిగిన ఆర్సీబీకి.. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ టార్గెట్‌కు తగ్గట్లే ఒక ఫ్లైయింగ్ స్టార్ట్ అందించారు. 5.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సాల్ట్ అవుట్ అయ్యాడు. కొద్ది సేపటికే రజత్ పాటిదార్, లివింగ్‌స్టోన్ కూడా అవుట్ అయ్యారు. దీంతో 90 పరుగుల వద్ద ఆర్సీబీ 3వ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ క్రీజ్‌లో ఇంకా కోహ్లీ ఉండటంతో ఎవరికీ నమ్మకం పోలేదు. కానీ, 30 బంతుల్లో 10 ఫోర్లతో 54 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత అసలైన సునామీ మొదలైంది. కెప్టెన్ జితేష్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌కు లక్నో బౌలర్లు చిగురాటకుల్లా వణికిపోయారు. 228 పరుగుల టార్గె్‌ట్ కూడా చిన్నబోయింది.
అంత పెద్ద స్కోర్‌ను ఆర్సీబీ మరో 8 బంతులు మిగిలి ఉండగానే కొట్టేసిందంటే.. ఆ క్రెడిట్ జితేష్ శర్మకు ఇవ్వాల్సిందే. కానీ, మరో రియల్ హీరోను మర్చిపోవద్దు. అతనే మయాంక్ అగర్వాల్. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన రన్స్ పెద్దగా హైలెట్ కాకపోయినా, జితేష్ సునామీ అతన్ని ఓవర్ షాడో చేసినా.. కూడా ఈ మ్యాచ్ విజయంలో మయాంక్ అగర్వాల్‌ది కూడా చాలా కీలక పాత్ర. విరాట్ కోహ్లీ లాంటి ఒక బిగ్ వికెట్ పడిన తర్వాత ఇన్నింగ్స్‌ను కొనసాగించే బాధ్యత అతనే తీసుకున్నాడు. జితేష్ అంత ఫియర్‌లెస్ ఇన్నింగ్స్ ఆడాడంటే మరో ఎండ్‌లో మయాంక్ ఉన్నాడనే ధైర్యంతోనే. మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 5 ఫోర్లలో 41 పరుగులు చేసి జితేష్ శర్మకు మంచి సపోర్ట్ అందించాడు.
విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉండి ఉంటే ఏం చేసేవాడో.. మయాంక్ కూడా సరిగ్గా అదే చేశాడు. ఆ ప్లేస్‌లో మయాంక్ కాకుండా మరో ప్లేయర్ ఉండి ఉంటే.. అనవసరపు అగ్రెషన్‌కు వెళ్లి వికెట్ సమర్పించుకుంటే.. పరిస్థిత కచ్చితంగా మరోలా ఉండేది. అలా కాకుండా మాయంక్ తన ఎక్స్‌పీరియన్స్‌తో అద్భుతంగా సిచ్యూయేషన్‌ను హ్యాండిల్ చేశాడు. అందుకే.. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందంటే.. జితేష్ శర్మకు ఎంత క్రెడిట్ ఇస్తున్నామో.. మయాంక్ కూడా అంతే అప్రిషియేట్ చేయాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Mayank agrawal deserve more appreciation ❤️#RCBvsLSG pic.twitter.com/SVwIBNWzFU
— विक्रम 𝘬ꪊꪑꪖ𝘳 🦇 (@printf_meme) May 27, 2025