SRH vs RR Playing XI, IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్.. 300 లోడింగ్ భయ్యో..

|

Mar 23, 2025 | 3:17 PM

Sunrisers Hyderabad vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2025 ఆసక్తికరమైన ప్రయాణం ప్రారంభమైంది. ఈ సంవత్సరం మెగా ఈవెంట్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమైంది. ఒకదాని తర్వాత ఒకటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం రెండవ రోజున డబుల్ హెడర్ కనిపిస్తుంది. సూపర్ సండేలో తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది.

SRH vs RR Playing XI, IPL 2025: టాస్ గెలిచిన రాజస్థాన్.. 300 లోడింగ్ భయ్యో..
Srh Vs Rr
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ (ఒకే రోజులో 2 మ్యాచ్‌లు) నేడు జరగనుంది. ఈ రోజు తొలి మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌లో తలపడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సంజు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

హైదరాబాద్‌లో రెండు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో, రాజస్థాన్ 1 మ్యాచ్‌లో గెలిచాయి. గత సీజన్‌లో క్వాలిఫయర్-2లో హైదరాబాద్ రాజస్థాన్‌ను ఓడించి ఓడించింది. ఈ రోజు జరిగే రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ అతిపెద్ద ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: సంజు శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..