IPL 2025 Auction: రెండోరోజూ కురిసిన కాసుల వర్షం.. అత్యధిక ప్రైజ్ పొందిన ఐదుగురు.. మనోళ్లే టాప్

|

Nov 25, 2024 | 6:18 PM

IPL 2025 Auction: వేలంలో కొన్ని ఉత్కంఠ బిడ్డింగ్‌లు చోటు చేసుకున్నాయి. టాప్ టాలెంట్ కోసం జట్లు పోరాడుతూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చాలా చురుకుగా ఉంది. కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లకు, భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు దక్కించుకున్నాయి.

IPL 2025 Auction: రెండోరోజూ కురిసిన కాసుల వర్షం.. అత్యధిక ప్రైజ్ పొందిన ఐదుగురు.. మనోళ్లే టాప్
Bhuvneshwar Kumar Deepak Ch
Follow us on

IPL 2025 వేలం రెండవ రోజు సౌదీ అరేబియాలోని జెడ్డాలో జోరందుకుంది. కేన్ విలియమ్సన్, ఆదిల్ రషీద్ వంటి స్టార్ పేర్లు అమ్ముడుపోకుండా ఆశ్చర్యం కలిగించగా.. మరికొందరు ఊహించని విధంగా కోట్లు దక్కించుకున్నారు.

మరోవైపు, రోవ్‌మన్ పావెల్, ఫాఫ్ డు ప్లెసిస్, మార్కో జాన్సెన్ వంటి ఆటగాళ్లు కొత్త టీంలలో చేరారు.

వేలంలో కొన్ని ఉత్కంఠ బిడ్డింగ్‌లు చోటు చేసుకున్నాయి. టాప్ టాలెంట్ కోసం జట్లు పోరాడుతూనే ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చాలా చురుకుగా ఉంది. కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లకు, భువనేశ్వర్ కుమార్‌ను రూ. 10.75 కోట్లకు దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు 2వ రోజు అత్యధిక ప్రైజ్ దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

1. భువనేశ్వర్ కుమార్ (భారతదేశం) – RCBకి రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

2. దీపక్ చాహర్ (భారతదేశం) – రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది.

3. ఆకాష్ దీప్ (భారతదేశం) – రూ. 8 కోట్లకు LSG కొనుగోలు చేసింది.

4. ముఖేష్ కుమార్ (భారతదేశం) – రూ. 8 కోట్లకు DCకొనుగోలు చేసింది. (RTM ద్వారా)

5. మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా) – రూ. 7 కోట్లకు PBKSకొనుగోలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..