IPL 2025: ముంబై చేతిలో ఓటమి.. ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లపైకి బాటిల్స్ విసిరేసిన ఫ్యాన్స్! వీడియో వైరల్

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో స సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు అడుగంటాయి.

IPL 2025: ముంబై చేతిలో ఓటమి.. ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లపైకి బాటిల్స్ విసిరేసిన ఫ్యాన్స్! వీడియో వైరల్
SRH vs MI, IPL 2025

Updated on: Apr 24, 2025 | 3:46 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 23) ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. హెన్రీచ్ క్లాసెన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), అభినవ్ మనోహర్(37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. రోహిత్ శర్మ 70 పరుగులతో ముంబైను ఈజీగా గెలిపించాడు. కాగా ఈ ఓటమితో ఎస్ ఆర్ హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు సన్నగిల్లాయి. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే ముంబై చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్‌.. ఆటగాళ్లపై వాటర్ బాటిల్స్ విసిరేశారంటూ ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారందరూ ఇది నిజమే అనుకుంటున్నారు. కానీ ఇది ఒక ఫేక్ వీడియో. EpicCommentsTelugu అనే ఒక ఇన్ స్టా గ్రామ్ యూజర్.. ఈ ఫేక్ వీడియోను షేర్ చేశాడు. సదరు యూజర్ ఆర్‌సీబీ ఫ్యాన్ అయినట్లున్నాడు. అందుకే ఎస్‌ఆర్ హెచ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేలా ఈ ఫేక్ వీడియోను షేర్ చేస్తున్నాడు.

ఇది ఫేక్ వీడియో అని, మిస్ లీడింగ్ కంటెంట్ అని ఎక్స్‌ ఏఐ టూల్ గ్రోక్ కూడా స్పష్టం చేసింది. ఈ ఘటన బుధవారం జరిగిన మ్యాచ్‌లో అసలు జరగలేదని, మైదానంలోకి బాటిల్స్ విసిరేసారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని గ్రోక్ క్లారిటీ ఇచ్చిది. పైగా ఉప్పల్ స్టేడియం రూల్స్ ప్రకారం వాటర్ బాటిల్స్‌ను అనుమతించరని కూడా గ్రోక్ పేర్కొంది. కానీ కొంత మంది ఈ ఫేక్ వీడియోను నిజమేనని పొరబడుతున్నారు. అదే సమయంలో ఇతరుల జట్లను, ఆటగాళ్లను టార్గెట్ గా చేసుకుని ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయడం బాధాకరమంటున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట చక్కర్లు కొడుతోన్న వీడియో ఇదే..

మ్యాచ్ తర్వాత హైదరాబాద్, ముంబై ఆటగాళ్లు..

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..