Video: క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ: చిన్ననాటి కోచ్

Vaibhav Suryavanshi Fitness: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అతను తన ఇన్నింగ్స్‌లో 11 భారీ సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

Video: క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ: చిన్ననాటి కోచ్
Vaibhav Suryavanshi Diet

Updated on: Apr 29, 2025 | 1:48 PM

Vaibhav Suryavanshi Diet: ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక పేరు ప్రతిధ్వనిస్తోంది. అది వైభవ్ సూర్యవంశీ. ఈ 14 ఏళ్ల భారత ఆటగాడు సాధించిన ఘనత చాలా మంది స్టార్ క్రికెటర్లు తమ కెరీర్ మొత్తంలో సాధించలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ తన మూడవ IPL ఇన్నింగ్స్‌లోనే లీగ్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించాడు. జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్ తర్వాత, అతని పేరు అందరి నోట నానుతోంది. ఈ యువ ఆటగాడిపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, వైభవ్ సూర్యవంశీ ఇక్కడికి చేరుకోవడానికి చేసిన త్యాగాలు, కృషి గురించి ఎవరికీ తెలియదు. వైభవ్ సూర్యవంశీ ఫిట్‌గా ఉండటానికి రెండు పెద్ద విషయాలను త్యాగం చేశాడు. ఈ విషయంలో అతని చిన్ననాటి కోచ్ ఒక కీలక విషయాన్ని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మటన్, పిజ్జా తినకూడదని నిషేధించాం – చిన్ననాటి కోచ్

వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనోజ్ ఓజా మాట్లాడుతూ, యువ క్రికెటర్‌ను ఫిట్‌గా ఉంచడానికి, మటన్, పిజ్జా వంటి అతనికి ఇష్టమైన ఆహారాన్ని వదులుకునేలా చేశామని అన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ, మటన్ తినకూడదని పూర్తి సూచనలు ఉన్నాయి. అతని డైట్ చార్ట్ నుంచి పిజ్జాను తొలగించాం. వైభవ్ సూర్యవంశీకి మటన్, చికెన్ అంటే చాలా ఇష్టం. పిజ్జా కూడా చాలా ఇష్టంగా తింటాడు. కానీ, క్రికెట్ కోసం ఇప్పుడు పిజ్జా తినడం మానేశాడు. ఈ రెండు తప్ప అన్నీ ఇచ్చేవాళ్లం. అయితే, మటన్ ఎంత పెట్టినా, పూర్తిగా తినేవాడు. అందుకే అతను కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాడు.’ అంటూ చెప్పుకొచ్చాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అతను తన ఇన్నింగ్స్‌లో 11 భారీ సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ లిస్ట్‌లో రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది కాకుండా, వైభవ్ ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..