SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. ఐపీఎల్‌లోనే రికార్డు స్కోరు నమోదు..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముంబై బౌలర్లను చితక బాదుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు మెరుపు అర్ధ సెంచరీలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది

SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. ఐపీఎల్‌లోనే రికార్డు స్కోరు నమోదు..
Sunrisers Hyderabad
Follow us

|

Updated on: Mar 27, 2024 | 9:58 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ముంబై బౌలర్లను చితక బాదుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు మెరుపు అర్ధ సెంచరీలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది.  అంతకుముందు 2013 సంవత్సరంలో పూణే వారియర్స్‌పై RCB 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పుడీ రికార్డును హైదరాబాద్ బద్దలు కొట్టేసింది.  ముందుగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్  హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు.  మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులతో  మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.  ఫలితంగా SRH జట్టు తన IPL చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును లిఖించింది. కానీ కొద్ది నిమిషాల్లోనే మూడో స్థానంలో వచ్చిన అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 16 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు కూడా లిఖించాడు.

ఇవి కూడా చదవండి

వీరిద్దరి కంటే ముందు, 2015, 2017లో, డేవిడ్ వార్నర్ CSK, KKR లపై  20 బంతుల్లో హైదరాబాద్ తరపున హాఫ్ సెంచరీలు సాధించిన అత్యంత వేగంగా ఆటగాడిగా నిలిచాడు.

హైదరాబాద్ ఇన్నింగ్స్ హైలెట్స్..

ముంబై ఇండియన్స్‌ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఎంత ఘోరంగా చితక్కొట్టారో ఈ గణంకాలే నిదర్శనం..

  1. హైదరాబాద్ తన ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు కొట్టింది.
  2. హైదరాబాద్ బ్యాటర్లు మొత్తం 19 ఫోర్లు కొట్టారు.
  3. పవర్‌ప్లేలో హైదరాబాద్ 81 పరుగులు చేసింది.
  4. తొలి 10 ఓవర్లలో హైదరాబాద్ 148 పరుగులు చేయడం ఐపీఎల్ రికార్డు.
  5. మార్క్రమ్, క్లాసెన్ 51 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో సతీమణి..
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
రోడ్డుపై వెళ్తూ ఒక్కసారిగా ఆగిన కారు.. కదలకపోవడంతో వెళ్లి చూస్తే
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
సేంద్రియ వ్యవసాయంతో అదిరే రాబడి.. ఏకంగా సంవత్సరానికి రూ.40 లక్షలు
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది
వేగంగావెళ్తున్నవాహనం టైర్‌ ఊడిపోయి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది