IPL 2024: ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ.. ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కింగ్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో చూశారా?

|

May 19, 2024 | 5:20 PM

Royal Challengers Bengaluru vs Chennai Super Kings:  IPL 2024 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ కోసం నాలుగు జట్లు ఫిక్స్ అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ టిక్కెట్‌ను ఖరారు చేసుకుంది

IPL 2024: ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ.. ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కింగ్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో చూశారా?
Virat Kohli Family
Follow us on

Royal Challengers Bengaluru vs Chennai Super Kings:  IPL 2024 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ కోసం నాలుగు జట్లు ఫిక్స్ అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ టిక్కెట్‌ను ఖరారు చేసుకుంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే, RCB కనీసం 18 పరుగులు లేదా 11 బంతుల తేడాతో CSKతో జరిగిన మ్యాచ్‌లో గెలవాలి. ఈ మ్యాచ్‌లో RCB 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి 7 మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ గోడకు కొట్టిన బంతిలా ఇలా అద్భుత పునరాగమనం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్లేఆఫ్‌కు చేరుకోవడంతో బెంగళూరు జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

ప్లే ఆఫ్ కు CSK అర్హత సాధించడానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాలి. ఫినిషర్ ఎంఎస్ ధోని క్రీజులో ఉండడంతో చెన్నై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలి బంతికే ధోనీ సిక్సర్ బాదాడు. అయితే, రెండో బంతికే యశ్ దయాల్ బౌలింగ్‌లో ధోని (13 బంతుల్లో 25) నిష్క్రమించాడు. ఆ తర్వాత దయాళ్ మరింత అద్భుతంగా బంతులేశాడు. . దీంతో తర్వాతి నాలుగు బంతుల్లో శార్దూల్, జడేజా ఒక్క పరుగు మాత్రమే చేయగలిగారు. సీఎస్‌కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ విజయం సాధించడంతో పాటు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. దీని తర్వాత విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్‌గా మారింది. గెలిచిన వెంటనే మైదానంలోకి పరిగెత్తిన విరాట్ ఆటగాళ్లను కౌగిలించుకుని సంబరాలు చేసుకున్నాడు. తరువాత, అతను ఒంటరిగా నిలబడి, తన టోపీని తీసివేసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని చూసి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న అనుష్క శర్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇద్దరి భావోద్వేగాలను కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ తరఫున కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 54 పరుగులు, విరాట్ కోహ్లీ 47 పరుగులు, రజత్ పటీదార్ 41 పరుగులు చేయడంతో ఐదు వికెట్లకు 218 పరుగులు వచ్చాయి. RCB జట్టు 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం కోహ్లీ జట్టు ఫైనల్ చేరాలంటే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఎలిమినేటర్‌లో, మే 22న రాజస్థాన్ రాయల్స్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో RCB తలపడాల్సి ఉంది.

ఆనందంలో అనుష్క… వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..