IPL 2024: పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లిస్టులో మనోళ్లే..

IPL 2024 Points Table: శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇది ఎనిమిదో ఓటమి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యా సేన 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2024: పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్ లిస్టులో మనోళ్లే..
Ipl 2024 Points Table
Follow us

|

Updated on: May 04, 2024 | 12:24 PM

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 (IPL 2024) 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 24 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత మైదానంలో ముంబైని ఓడించడంలో KKR విజయం సాధించింది.

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఇప్పుడు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లను కలిగి ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇది ఎనిమిదో ఓటమి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. హార్దిక్ పాండ్యా సేన 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆరెంజ్ క్యాప్‌లో ఉన్నాడు. పర్పుల్ క్యాప్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా 17 వికెట్లతో టి నటరాజన్‌ను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు.

IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే:

1) రాజస్థాన్ రాయల్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లు

3) లక్నో సూపర్‌జెయింట్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

5) చెన్నై సూపర్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

7) పంజాబ్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) గుజరాత్ టైటాన్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

9) ముంబై ఇండియన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 10 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్?

1- రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్): 10 మ్యాచ్‌ల తర్వాత 509 పరుగులు

2- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): 10 మ్యాచ్‌ల తర్వాత 500 పరుగులు

3- సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్): 10 మ్యాచ్‌ల తర్వాత 418 పరుగులు

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు?

1- జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): 11 మ్యాచ్‌ల తర్వాత 17 వికెట్లు

2- టి. నటరాజన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): 8 మ్యాచ్‌ల తర్వాత 15 వికెట్లు

3- ముస్తాఫిజుర్ రెహ్మాన్ (చెన్నై సూపర్ కింగ్స్): 9 మ్యాచ్‌ల తర్వాత 14 వికెట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles