IPL 2024: హార్దిక్ ఉన్నా.. ముంబైకి కప్ కష్టమే.. ఈ ఏడాది కూడా బుల్డోజర్, బాహుబలి ఫైట్ పక్కా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు గెలిచిన ఈ జట్టు.. గత మూడు వరుస సీజన్‌లలోనూ టైటిల్‌ను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఆటతీరుపైనే అందరి దృష్టి పడింది.

IPL 2024: హార్దిక్ ఉన్నా.. ముంబైకి కప్ కష్టమే.. ఈ ఏడాది కూడా బుల్డోజర్, బాహుబలి ఫైట్ పక్కా..
Mi

Updated on: Mar 15, 2024 | 9:28 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు గెలిచిన ఈ జట్టు.. గత మూడు వరుస సీజన్‌లలోనూ టైటిల్‌ను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఆటతీరుపైనే అందరి దృష్టి పడింది. అంతేకాకుండా ఈసారి సీజన్‌కు ముందుగా ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయని చెప్పాలి. ఐపీఎల్ 2024 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకోవడం.. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పడం లాంటివి ముంబై ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదని చెప్పాలి. ఇదంతా పక్కనపెడితే.. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం హార్దిక్ పాండ్యాకు కత్తి మీద సాము అనే చెప్పాలి. 11 సీజన్లలో జట్టుకు సారథ్యం వహించి, 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఈ ఏడాది ముంబై కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడం.. ఆ ఫ్రాంచైజీ తీసుకున్న సంచలన నిర్ణయం.

హార్దిక్ తన బౌలర్లను ఎలా ఉత్సాహపరుస్తాడు, టీంలో ఎలా ఐక్యతను తీసుకోస్తాడో చూడాలి. కెప్టెన్‌గా తన మొదటి రెండు సీజన్‌లలో గుజరాత్‌‌ను ఛాంపియన్‌గా, ఆపై రన్నరప్‌గా నిలిచిన హార్దిక్.. ఈసారి ముంబై ఇండియన్స్‌ను ఎంతవరకు తీసుకెళ్తాడనేది మాజీ క్రికెటర్లు సైతం వేచి చూస్తున్నారు. ఇక్కడ యాదృచ్ఛికం ఏమిటంటే, ముంబై తన మొదటి మ్యాచ్‌ను మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో తలబడనుంది. ముంబై జట్టుకు బ్యాటింగ్ ప్రాణం. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ముంబైకి మిడిలార్డర్‌లో తిలక్ వర్మ బలంగా కనిపిస్తున్నాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝలిపిస్తాడు. వీరితో పాటు గత సీజన్‌లో రైజింగ్ స్టార్ నెహాల్ వధేరా, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్ వంటి హార్డ్ హిట్టర్స్ పుష్కలంగా ఉన్నారు. మరోవైపు ఫినిషర్ పాత్రలో టిమ్ డేవిడ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

బుమ్రా పునరాగమనం..

బౌలింగ్ విషయానికొస్తే.. ముంబై జట్టు కొంచెం వీక్ అనే చెప్పాలి. ఈ సీజన్‌లో చాలామంది కొత్త బౌలర్లు బరిలోకి దిగనున్నారు. అటు వెటరన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశం. గత సీజన్‌లో, బుమ్రా గాయం కారణంగా ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఆకాష్ మధ్వల్, విదేశీ పేసర్లు గెరాల్డ్ కోట్జియా, దిల్షాన్ మధుశంక, నువాన్ తుషారలపై బౌలింగ్ లైనప్ ఆధారపడి ఉంది.

ముంబై ఇండియన్స్ జట్టు:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రూయిస్, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, మహ్మద్ నబీ, అర్జున్ టెండూల్కర్, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, గెరాల్డ్ కొట్జియా, అన్షుల్ డి కాంబోజ్, నమన్ డి కాంబోజ్, , శివాలిక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండార్ఫ్, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార