Virat Kohli: దటీజ్‌ కింగ్‌ కోహ్లీ.. చిన్ననాటి కోచ్‌ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న విరాట్.. వైరల్‌ వీడియో

|

May 06, 2023 | 9:15 PM

గౌతమ్‌ గంభీర్, నవీన్‌ ఉల్‌ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్ నెస్ మాత్రమే కాదు..  మంచి మనసు కూడా దాగుందని కింగ్‌ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మను కలుసుకున్నాడు విరాట్

Virat Kohli: దటీజ్‌ కింగ్‌ కోహ్లీ.. చిన్ననాటి కోచ్‌ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న విరాట్.. వైరల్‌ వీడియో
Virat Kohli
Follow us on

టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఐపీఎల్‌లో పరుగులు వర్షం కురిపిస్తున్న విరాట్‌ తన అగ్రెసివ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా గౌతమ్‌ గంభీర్, నవీన్‌ ఉల్‌ హక్‌ల గొడవలతో కోహ్లీలోని దందుడకుతనం మరోసారి నిరూపితమైంది. అయితే తనలో అగ్రెసివ్ నెస్ మాత్రమే కాదు..  మంచి మనసు కూడా దాగుందని కింగ్‌ కోహ్లీ రుజువు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మను కలుసుకున్నాడు విరాట్. తన క్రికెట్‌ కెరీర్‌కు పునాది వేసిన ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. రాజ్ కుమార్ శర్మ మైదానంలోకి రాగానే ప్రాక్టీసును సైతం ఆపేసి మరీ గురువ దగ్గరకు వచ్చాడు కింగ్‌. ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల సంతోషించిన కోచ్‌ విరాట్‌ వీపు తట్టి దీవెనలు అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా కోహ్లీకి తెలుసు’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు విరాట్ కోహ్లీ. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో 12 పరుగుల స్కోరు వద్ద ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. కాగా కడపటి వార్తలందే సమయానికి బెంగళూరు 18.2 ఓవర్లలో 166 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ వీడియో:

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..