ఐపీఎల్ 2023లో విప్లవాత్మక మార్పులు.. సరికొత్త అనుభూతితో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడున్నా ఫ్రెండ్స్‌తో కలిసి చూసే ఛాన్స్..

ఈ ఏడాది జూన్‌లో జరిగిన IPL మీడియా హక్కుల వేలంలో Viacom18 భారత ఉపఖండం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో లైవ్ స్ట్రీమింగ్‌లో సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఐపీఎల్ 2023లో విప్లవాత్మక మార్పులు.. సరికొత్త అనుభూతితో లైవ్ స్ట్రీమింగ్.. ఎక్కడున్నా ఫ్రెండ్స్‌తో కలిసి చూసే ఛాన్స్..
Ipl 2023 Live Streaming

Updated on: Aug 30, 2022 | 5:36 PM

IPL 2022 అనేక విధాలుగా విభిన్నంగా సాగింది. 2014 తర్వాత మొదటిసారిగా, 10 జట్లు అడుగుపెట్టాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మొత్తం సీజన్‌ను భారతదేశంలోనే నిర్వహించారు. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ 2023 నుంచి 2027 వరకు టెలికాస్ట్ హక్కులను వేలం వేసింది. మొత్తం 4 ప్యాకేజీల కింద ఈ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ప్యాకేజీ Aలో భారత ఉపఖండం కోసం మాత్రమే టీవీ హక్కులు ఉన్నాయి. అయితే ప్యాకేజీ B అనేది భారత ఉపఖండంలో డిజిటల్ హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించింది. అదే సమయంలో ప్యాకేజీలు C, D కూడా వేర్వేరు హక్కులను కలిగి ఉన్నాయి. ఈ నాలుగు ప్యాకేజీల మొత్తం బేస్ ధర రూ.32 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.

డిజిటల్ హక్కులు వయాకామ్ 18 సొంతం..

వయాకామ్ 18 భారతదేశ డిజిటల్ హక్కులను పొందింది. ఇందుకోసం రిలయన్స్ కంపెనీ వయాకామ్ 18 పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ విభిన్న శైలిలో ఉంటుందని రిలయన్స్ ఏజీఎంలో జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. అభిమానులు వివిధ కోణాల్లో మ్యాచ్‌లను చూడటమే కాకుండా స్నేహితులతో కలిసి మ్యాచ్‌లను చూడగలుగుతారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ విభిన్నమైన రీతిలో లైవ్ స్ట్రీమింగ్..

ఈసారి IPL ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉంటుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్‌లో ఉండదు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు వయాకామ్ 18 OTT ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లాల్సి ఉంది. రెండు వేర్వేరు కంపెనీలు ఐపీఎల్‌ హక్కులను పొందడం ఇదే తొలిసారి.

Viacom 18 పూర్తిగా భిన్నమైన రీతిలో IPLని ప్రసారం చేస్తుంది. ఇప్పటి వరకు మ్యాచ్‌ల సమయంలో ప్రతిచోటా ఒకే వీడియో స్ట్రీమ్ ఉండేది. కానీ. JioFiber బలమైన నెట్‌వర్క్ కారణంగా, IPL మ్యాచ్‌లు ఏకకాలంలో బహుళ వీడియో స్ట్రీమ్‌లను కలిగి ఉంటాయి. ఇవన్నీ వేర్వేరు కెమెరా యాంగిల్స్‌లో ఉంటాయి. అంటే మ్యాచ్ చూసే వ్యక్తి తనకు నచ్చిన కెమెరా యాంగిల్ నుంచి మ్యాచ్ ను వీక్షించవచ్చు.

అత్యాధునిక టెక్నాలజీతో 5జీలో స్ట్రీమింగ్ ఉంటుందని రిలయన్స్ ఏజీఎం ఆకాష్ అంబానీ తెలిపారు. దీంతో అభిమానులకు గతంలో కంటే మ్యాచ్ వీక్షించిన అనుభవం లభించనుంది. ఇందుకోసం కంపెనీ రూ.2 లక్షల కోట్లు వెచ్చించనుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌ను మొదటిసారిగా 4k నాణ్యతతో చూడగలుగుతారు.

మ్యాచ్ సమయంలో, వినియోగదారులు వీడియో కాల్ ద్వారా దేశంలో ఉన్న వారి స్నేహితులతో కనెక్ట్ కాగలరు. దీంతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేయనున్నారు. దీనికి ‘వాచ్ పార్టీ’ అని పేరు పెట్టారు.

100 మిలియన్ల ఇళ్లను 5జీ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తామని రిలయన్స్ తెలిపింది. ముందుగా మెట్రో నగరాల్లో ప్రారంభించినా, క్రమంగా అన్ని ప్రాంతాలకు ఈ సౌకర్యం రానుంది. ఐపీఎల్ కంటే ముందే వీలైనన్ని ఎక్కువ చోట్ల చేరేలా చేయాలన్నది వారి ప్రయత్నంగా తెలుస్తోంది.