IPL 2023 Points Table: చెన్నైకి షాకిచ్చిన అగ్రస్థానం చేరిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో దిగజారిన ధోనీ సేన..

|

Apr 28, 2023 | 3:39 AM

RR vs CSK: ఐపీఎల్ 16లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

IPL 2023 Points Table: చెన్నైకి షాకిచ్చిన అగ్రస్థానం చేరిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో దిగజారిన ధోనీ సేన..
Follow us on

IPL 2023: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో CSKని ఓడించింది. ఈ సీజన్‌లో చెన్నైపై రాజస్థాన్ రెండోసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కూడా భారీ మార్పు కనిపించింది. ఈ ఓటమితో చెన్నై నంబర్‌వన్‌ కిరీటాన్ని చేజార్చుకుంది. అదే సమయంలో ఈ విజయంతో, రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ మూడవ స్థానానికి పడిపోయింది.

ఈ మ్యాచ్‌కు ముందు, చెన్నై జట్టు 7 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో, 10 పాయింట్లు కసాధించింది. దీంతో +0.662 నెట్ రన్‌రేట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలిచి మొదటి స్థానంలో నిలిచింది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ ఇప్పుడు 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో +0.939 నెట్ రన్‌రేట్‌తో నంబర్ వన్‌గా మారింది.

పాయింట్ల పట్టికలో టాప్-5 జట్లు ఇవే..

పాయింట్ల పట్టికలో రాజస్థాన్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసి రెండో స్థానంలో ఉంది. జట్టు 10 పాయింట్లతో +0.580 నెట్ రన్‌రేట్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లు, +0.376 నెట్ రన్‌రేట్‌తో మూడవ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లు, +0.547 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 విజయాలు, 8 పాయింట్లు, -0.139 నెట్ రన్‌రేట్‌తో ఐదవ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది మిగతా జట్ల పరిస్థితి..

ఇందులో, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో, 4 విజయాలు, 8 పాయింట్లు-0.162 నెట్ రన్‌రేట్‌తో ఆరో స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 పాయింట్లు, -0.027 నెట్ రన్‌రేట్‌తో ఏడవ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. -0.620 నెట్ రన్‌రేట్‌తో ముంబై నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు, 4 పాయింట్లు, -0.725 నెట్ రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 4 పాయింట్లు, -0.961 నెట్ రన్‌రేట్‌తో 10వ స్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..