సాధారణంగా క్రికెటర్లది లగ్జరీ లైఫ్ అని భావిస్తారు చాలామంది. కోట్ల కొద్దీ ఆదాయం, విలాసవంతమైన జీవనం.. ఇంకా వారికేం కష్టాలుంటాయి అనుకుంటారు. అయితే అందరి జీవితాలు ఒకలా ఉండవు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అమోఘంగా రాణిస్తున్న ఆటగాళ్లలో చాలామంది ఎన్నో కష్టాలను దాటి వచ్చిన వారే. కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు దాటి తమ లక్ష్యాన్ని చేరుకున్న వారే. ఈ కోవకే చెందుతాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న నాథన్ ఎల్లిస్. ఇంతకుముందెన్నడూ పెద్దగా వినిపించని ఈ పేరు వినిపించలేదు. అయితే బుధవారం రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో నాథన్ ఎల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను బట్లర్, సంజూశామ్సన్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్ లాంటి హేమాహేమీలను ఔట్ చేశాడు. పంజాబ్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. 2018 లో తొలి సారి హోబర్ట్ తరపున దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఎల్లిస్.. 2021 లో బంగ్లాదేశ్ సిరీస్ ద్వారా మొదటి సారి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. తొలి మ్యాచ్ లోనే హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు . ఆ తర్వాత టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఐపీఎల్‌లో నాలుగు వికెట్లు తీసి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఆస్ట్రేలియా క్రికెట్‌లో కీలక బౌలర్‌గా ఎదుగుతున్న ఎల్లిస్ ఎన్నో కష్టాలను దాటి ఈ స్థాయికి చేరుకున్నాడట. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతను తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులను పంచుకున్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి ముందు నేను చాలా లేబర్ ఉద్యోగాలు చేసాను. సేల్స్ మెన్ గా ప్రతిరోజు ఉదయం ఇంటింటికీ తిరిగే వాడిని. ఇది నాకు చాలా భయంకరంగా అనిపించేది. అంతే కాదు కన్ స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు చాలా అలిసి పోయేవాడిని. ఓ వైపు క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూనే.. మరో వైపు పొట్ట కూటి కోసం ఏదో ఒక చిన్న ఉద్యోగం చేశావాడిని. కొన్ని సార్లు శారీరకంగానే కాదు మానసికంగా నేను చాలా అలిసిపోయేవాడిని. అయితే ప్రస్తుతం నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు ఎల్లిస్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..