IPL 2023: ‘ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్.. నెక్స్ట్ సీజన్‌కు ఫసకే’

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్(రూ. 18.5 కోట్లు) నిలిచిన సంగతి తెలిసిందే.

IPL 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్.. నెక్స్ట్ సీజన్‌కు ఫసకే
Sam Curran

Updated on: Jun 05, 2023 | 6:32 PM

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్(రూ. 18.5 కోట్లు) నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మెగా వేలంలో అతడ్ని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో కర్రన్‌ను వచ్చే సీజన్‌కు ముందుగా వదులుకోవాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందని వార్తలు వినిపించాయి. ఇక వీటిని సమర్ధిస్తూ.. ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా పలు కీలక కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2024 వేలానికి ముందుగా పంజాబ్ కింగ్స్.. సామ్ కర్రన్‌ను వదిలించుకునేందుకు చూస్తుందన్నాడు. సీఎస్కే తరపున ఆడిన అతడు.. ఆ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించడంలో సహాయపడ్డాడు. కానీ పంజాబ్‌కు మాత్రం ఈ ఏడాది ఏం ఆడలేదని.. తనపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్‌లో సామ్ కర్రన్ పెర్ఫార్మన్స్ చూసి.. పంజాబ్ తొందరపడిందని.. అతడిపై పెట్టిన డబ్బుకు నలుగురు ఆల్‌రౌండర్లను సొంతం చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో కర్రన్ మెరుపులు మెరిపించలేకపోయాడని తెలిపాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో సామ్ కర్రన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులతో పాటు, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.