తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల చేయాల్సి ఉండేది. అయితే మ్యాచ్‌కు వర్షం అడ్డు పడింది. దీంతో ఆట నిలిచిపోయింది. చివరకు వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత గుజరాత్-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ 12.10 గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌కింగ్స్ విజయ లక్ష్యం 171 పరుగులు.