IPL 2022: ఓటమితో పాటు రూ.12 లక్షలు నష్టపోయిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా..

|

Apr 08, 2022 | 8:39 AM

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) లక్నో సూపర్‌ జెయింట్స్ మ్యాచ్‌లో రూ. 12 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది.

IPL 2022: ఓటమితో పాటు రూ.12 లక్షలు నష్టపోయిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా..
Rishabh Pant
Follow us on

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) లక్నో సూపర్‌ జెయింట్స్ మ్యాచ్‌లో రూ. 12 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలయింది కూడా. అసలు పంత్ రూ. 12 లక్షలు ఎలా నష్టపోయాడో చూద్దాం.. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో ఢిల్లీకి ఇది రెండో ఓటమి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో మ్యాచ్‌ల్లో మూడు విజయాలను నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ స్లో ఓవర్‌ రేటు(slow over rate) కారణంగా పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. IPL 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి స్లో ఓవర్ రేట్ ఇదే మొదటిది.

ఇంతకుముందు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించారు. ఈ స్లో ఓవర్‌ రేట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్‌లకు రూ. 12 లక్షల జరిమానా విధించారు. 12 లక్షల రూపాయల నష్టాన్ని చవిచూసిన పంత్.. ఐపీఎల్‌ 2022లో ఇప్పటివరకు ఫైన్‌ విధించిన కెప్టెన్లలో మూడో కెప్టెన్‌గా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ రిషబ్ పంత్ 36 బంతుల్లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 2 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

Read Also.. IPL 2022: గుజరాత్‌ టైటాన్స్‌కు మాస్టర్ చెఫ్ దొరికాడు.. ఆఫ్ఘని చికెన్ కర్రీ చేసిన బౌలర్.. వైరల్‌గా మారిన వీడియో..