క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫిట్‌నెస్ సంస్కృతి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోనే కాదు ఇప్పుడు ప్రతి క్రికెట్ టీమ్‌లోనూ ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కారణంగానే టీమిండియా ఆటతీరు మెరుగైంది. కానీ, ప్రశ్న ఏమిటంటే, ఫిట్‌నెస్ నిజమైన కొలత ఏమిటి? క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంటే మన కోటాలో పూర్తి ఓవర్‌లను మంచి రన్నింగ్‌లో బౌలింగ్ చేయడం, ఫీల్డింగ్ చేయడం, తుఫాన్ బ్యాటింగ్ చేయడమే, ఫిట్‌నెస్‌లో ఉన్నామని అంటుంటాం. కానీ, బహుశా కొన్ని జట్లు ఫిట్‌నెస్ కారణంగా తమ మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లను దూరం పెడుతున్నాయి. వెస్టిండీస్‌కు చెందిన షిమ్రాన్ హెట్‌మెయర్(Shimron Hetmyer), శ్రీలంకకు చెందిన భానుక రాజపక్సే(Bhanuka Rajapaksa) విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రాజపక్సే, హెట్‌మెయర్ ఇద్దరూ ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో టీమ్‌ల నుంచి తొలగించారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ 2022(IPL 2022) ప్రారంభ మ్యాచ్‌లలో, బ్యాట్‌తో రచ్చ చేసి, ఆకట్టుకున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న హెట్మెయర్, తన హిట్టింగ్ బలంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అలాగే పంజాబ్ కింగ్స్‌కు చెందిన భానుక రాజపక్స కూడా తన చురుకైన బ్యాటింగ్‌తో బెంగళూరు బౌలింగ్ దాడిని నాశనం చేశాడు.
రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన హెట్మెయర్..
షిమ్రాన్ హెట్మెయర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. హెట్మెయర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 13 బంతులు ఆడాడు. ఇంత తక్కువ బంతుల్లో 32 పరుగులు చేసి రాజస్థాన్‌ను 210 భారీ స్కోర్‌కు తీసుకెళ్లాడు. హెట్మెయర్ బ్యాట్‌లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టాడు. ఆ సమయంలో స్ట్రయిక్ రేట్ 246గా ఉంది. హెట్మెయర్ ఇలాగే రాణిస్తే, అతను ఎలా అన్‌ఫిట్ అవుతాడు? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
విధ్వంసం సృష్టించిన భానుక రాజపక్సే..
ఫిట్‌నెస్ దృష్ట్యా భానుక రాజపక్సను శ్రీలంక టీం నుంచి తొలగించింది. అయితే పంజాబ్ కింగ్స్ ఎడమచేతి వాటం ఆటగాడికి ప్లేయింగ్ XIలో చోటు కల్పించింది. ఐపీఎల్ అరంగేట్రంలోనే భానుక ఆర్సీబీ బౌలర్లను చిత్తు చేశాడు. అతను 22 బంతుల్లో 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. రాజపక్సే ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను 206 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. రాజపక్సే, హెట్‌మెయర్‌ల ఆటతీరు చూస్తుంటే ఐపీఎల్ 2022లో కీలక ప్లేయర్లుగా మారే అవకాశం ఉంది.
Also Read: IPL 2022: కేన్ మామకు మరోషాక్.. ఆ విషయంలో రోహిత్ సరసన.. ఇదే రిపీటైతే ఇద్దరిపై వేటే?
IPL 2022: ఆ ఇద్దరూ బరిలోకి దిగితే ఆర్‌సీబీకి చుక్కలే.. సిక్సర్లతో బౌలర్ల ఊచకోతే.!