రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనే ఇది కనిపిస్తోంది. వరుసగా విఫలం అవుతోన్న విరాట్.. తాజాగా ఏప్రిల్ 26న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే ఆటతీరుతో పెవిలియన్ చేరి, మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోసారి భారీ స్కోరు చేయలేకపోయాడు. అయితే, దాదాపు రెండు మ్యాచ్‌ల తర్వాత, విరాట్ కోహ్లీ తన ఖాతా తెరవడం ఒక్కటే మార్పు కనిపించింది. మిగిలినదంతా సేమ్. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌ల్లో అతను గోల్డెన్ డక్‌కి బలయ్యాడు. రాజస్థాన్ రాయల్స్(RR)పై విరాట్ కోహ్లీ బౌండరీతో ఖాతా తెరిచాడు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బంతిని పుల్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాట్ అంచున తాకింది. బాల్ పాయింట్ వద్ద నిలబడిన రియాన్ పరాగ్ చేతుల్లోకి వెళ్లింది. ఈ షార్ట్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 10 బంతులు ఆడి రెండు ఫోర్లు సహా 9 పరుగులు చేశాడు.
స్థానం మారినా.. వైఫల్యం మాత్రం మారలే..
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడో స్థానంలో మాత్రమే బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ ఈసారి కూడా అద్భుతాలు చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానుల ఎదురుచూపులు పెరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ చాలా కాలంగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో.. ఈ నిరీక్షణ మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఐపీఎల్‌లో ఆరంభం నుంచి, వరుసగా విఫలమవుతోన్న విరాట్.. ఇప్పటికైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్‌తోపాటు, ఫ్రాంచైజీ కూడా కోరుకుంటోంది. నెటిజన్లు మాత్రం తీవ్రంగా ఫైరవుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయని, ఇంకెప్పుడు ఫాంలోకి వస్తావంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 128 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీ సగటు 16గా ఉంది. అందులో అతను ఐదుసార్లు డబుల్ ఫిగర్‌ను కూడా టచ్ చేయలేకపోయాడు.
IPL 2022లో విరాట్ కోహ్లీ: 41*, 12, 5, 48, 1, 12, 0, 0, 9 పరుగులు
The struggle is real, even champions have to overcome their inner demons. And, are we witnessing an inspirational story in the making?@imVkohli @IPL #RCBvsRR #ViratKohli pic.twitter.com/NhUOcbWNK2
— Devesh Chanchlani (@devesh_ch) April 26, 2022
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!