IPL 2022 Purple Cap Race: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రెచ్చిపోయాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకి దడ పుట్టించాడు. అతడి దెబ్బకి గుజరాత్ టాప్ ఆర్డర్ మొత్తం ధ్వంసమైంది. 4 ఓవర్ల బౌలింగ్‌లో 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ ఇది పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న యుజ్వేంద్ర చాహల్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ క్యాప్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తలపై ఉంది. కానీ ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌తో ముందుకు సాగడంతో ఇప్పుడు చాహల్‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లే.
ఉమ్రాన్ 5 వికెట్లతో రెండో స్థానం
గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ మాలిక్ 8 మ్యాచ్‌ల తర్వాత మొత్తం వికెట్ల సంఖ్య 15కి చేరుకుంది. దీంతో నేరుగా రెండో స్థానానికి ఎగబాకాడు. అప్పటికే సిట్టింగ్‌లో ఉన్న టి.నటరాజన్‌ను మూడో స్థానానికి నెట్టివేశాడు. నటరాజన్ 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించాడు. కానీ ఉమ్రాన్ అతని కంటే ఒక ఓవర్ తక్కువ బౌలింగ్ చేశాడు.
ఉమ్రాన్ వల్ల చాహల్‌కి ముప్పు!
మరోవైపు 8 మ్యాచ్‌లు ఆడి18 వికెట్లు పడగొట్టిన యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం అందరికంటే ముందున్నాడు. గత కొన్ని రోజులుగా చాహల్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఉమ్రాన్ ఫామ్ చూస్తుంటే రానున్న రోజుల్లో చాహల్‌కు గట్టి పోటీ ఇస్తాడనడంలో సందేహం లేదు. పర్పుల్ క్యాప్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో 14 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కుల్దీప్ యాదవ్ 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ 13 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వనిందు హసరంగా 13 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి