IPL 2022: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చిన పంజాబ్‌.. తొమ్మిదో ప్లేసుకు చెన్నై.. టాప్‌లో ఎవరున్నారంటే..

| Edited By: Shaik Madar Saheb

Apr 04, 2022 | 8:20 AM

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (PBKS vs CSK) జట్లు తలపడ్డాయి. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై పంజాబ్‌ చేతిలో 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది

IPL 2022: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకొచ్చిన పంజాబ్‌.. తొమ్మిదో ప్లేసుకు చెన్నై.. టాప్‌లో ఎవరున్నారంటే..
Ipl 2022 Points Table
Follow us on

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ (PBKS vs CSK) జట్లు తలపడ్డాయి. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై పంజాబ్‌ చేతిలో 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా మూడో ఓటమి. ఇలా సీజన్ ప్రారంభంలో చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ చెన్నైకి 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో చతికిలపడిన చెన్నై జట్టు కేవలం 126 పరుగులకే ఆలౌటైంది. కాగా ఈవిజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా, చెన్నై తొమ్మిదో స్థానానికి పడిపోయింది. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన రాజస్థాన్‌ రాయల్స్‌ మొదటి స్థానంలో ఉండగా, మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 2వ స్థానంలో ఉండి. ఇక హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ ( రెండు విజయాలు) మూడో స్థానంలో, ఢిల్లీ క్యాపిట్సల్‌ ( ఒక గెలుపు, ఒక ఓటమి) ఐదో ప్లేసులో, కే.ఎల్. రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ( ఒక గెలుపు, ఒక ఓటమి) ఆరో స్థానంలో, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఒక ఓటమి, ఒక గెలుపు), ఏడో స్థానంలో ఉన్నాయి. ఇక రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ ఎనిమిదో స్థానంలో, ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ పదో స్థానంలో ఉన్నాయి.

ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికి బహూకరించే ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ ముందున్నాడు. అతను రెండుమ్యాచ్‌ల్లో 135 పరుగులు చేశాడు. రాజస్థాన్‌కు చెందిన జోస్ బట్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నైకి చెందిన శివమ్ దూబే మూడో స్థానంలో ఉండగా లివింగ్‌స్టన్ నాలుగో స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ రెండు మ్యాచ్‌ల్లో 95 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో..

టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో యుజువేంద్ర చాహల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ (5వికెట్లు) మూడు, కోల్‌కతాకు చెందిన టిమ్ సౌతీ (5 వికెట్లు) నాలుగు, వసిందు హసరంగా (5 వికెట్లు ) ఐదో స్థానంలో ఉన్నారు.

Also Read: Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో విషాదం.. వేర్వేరు కారణాలతో ముగ్గురు మృతి

Krithi Shetty : యంగ్ హీరో సినిమాకు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ.. కారణం అదేనా..

రిప్డ్ జీన్స్‌ స్టైలిష్ టాప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్