చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్లో నాలుగు సార్లు విజేతగా నిలిపిన మొనగాడు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో అయినా.. తన మార్క్ స్ట్రాటజీతోనే గేమ్‌ను మార్చివేసే నాయకుడు. భారత క్రికెట్ టీమ్‌కు అద్భుత సేవలు అందించిన వ్యక్తి. అతడే మహేంద్ర సింగ్ ధోని. ఇప్పుడు ధోని అభిమానుల ముందు ఉన్న ప్రధాన ప్రశ్న..అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడతాడా లేదా?. ఈ ప్రశ్న వారిని తెగ కలవరపెడుతోంది. మహీ కూడా దీని గురించి పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. బీసీసీఐ రిటెన్షన్ పాలసీ బట్టి తను ఆడేది ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కానీ ఇప్పుడు చెన్నై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది సీఎస్కే మేనేజ్మెంట్. వచ్చే సీజన్ కోసం రిటెన్షన్ ఉందన్నది నిజమే.. అయితే ఎంతమందిని మళ్లీ తీసుకోవచ్చనేది ఇంకా స్పష్టత లేదని చెన్నై సూపర్‌కింగ్స్ మెంబర్ ఒకరు చెప్పారు. కానీ ధోనీనే తమ తొలి ప్రాధాన్యమని క్లారిటీ ఇచ్చారు. “ఈ షిప్‌కు కెప్టెన్ ఉండాల్సిందే ధోనియే.. కచ్చితంగా చెబుతున్నా అతడు వచ్చే ఏడాది కూడా ఆడతాడు” అని ఆయన తెలిపారు.
ఐపీఎల్ ఫైనల్ అనంతరం….
ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై విజేతగా నిలిచిన అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు ధోనీ. ఐపీఎల్లో నేను ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. కొత్తగా రెండు జట్లు వస్తున్నాయని… ఈ సమయంలో తన రిటైర్మెంట్ గురించి కాకుండా… చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తానని తెలిపాడు. పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలవడం తమకు ముఖ్యం కాదని.. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లు బృందాన్ని తయారు చేయడం లక్ష్యమన్నారు. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం తాము చూస్తున్నట్లు తెలిపాడు.
Also Read: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ