IPL 2022: బీబీఎల్ స్టార్‌లకు బంఫర్ ఆఫర్.. మెగా వేలంలో డబ్బులే డబ్బులు.. టాప్‌5లో ఎవరున్నారంటే?

|

Jan 30, 2022 | 11:05 AM

IPL 2022 Mega Auction: ఆస్ట్రేలియన్ లీగ్‌లో సందడి చేసిన కీలక ప్లేయర్లకు ఫిబ్రవరిలో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో కనక వర్షం కురిసే అవకాశం ఉంది.

IPL 2022: బీబీఎల్ స్టార్‌లకు బంఫర్ ఆఫర్.. మెగా వేలంలో డబ్బులే డబ్బులు.. టాప్‌5లో ఎవరున్నారంటే?
Ipl 2022
Follow us on

IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం(IPL 2022 Mega Auction) కోసం అన్ని జట్ల సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1214 మంది ఆటగాళ్లు ఈసారి భారీ వేలంలో పాల్గొనబోతున్నారు. కాగా, బిగ్ బాష్ లీగ్ (BBL) ఆటగాళ్లు ఈవేలంలో పాల్గొనబోతున్నారు. అయితే వీరికి అత్యధికంగా డబ్బు సంపాదించే అవకాశం దక్కనుంది. ఈ లిస్టులో కొద్దిమంది ప్లేయర్లు ఉన్నారు. వారిలో బెన్ మెక్‌డెర్మాట్, జాసన్ సంఘా, డేనియల్ సామ్స్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్(IPL) మెగా వేలంలో పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకోగల 5 BBL ప్లేయర్‌లు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.

1. బెన్ మెక్‌డెర్మోట్:
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెన్ మెక్‌డెర్మాట్ నిలిచాడు. ఈ సీజన్‌లో BBLలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మెక్‌డెర్మాట్ పలు రికార్డులు నెలకొల్పాడు. హోబర్ట్ హరికేన్స్ జట్టు తరపున ఆడుతూ, అతను 13 మ్యాచ్‌లలో 153.87 స్ట్రైక్ రేట్, 48.08 సగటుతో మొత్తం 577 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు. మెక్‌డెర్మాట్ ఇంతకు ముందు IPL ఆడలేదు. కానీ, బిగ్ బాష్‌లో అతని ప్రదర్శనతో ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి కాంట్రాక్ట్‌ను పొందే అవకాశం ఉంది. మెక్‌డెర్మాట్ మిడిల్ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతోపాటు చివరి ఓవర్లలో వేగంగా పరుగులు కూడా చేయగలడు. వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆటగాడిపై దృష్టి పెట్టవచ్చు.

2. పీటర్ సీడ్ల్:
ఈ జాబితాలో రెండవ స్థానంలో వెటరన్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సీడ్ల్ నిలిచాడు. ఈసారి బిగ్ బాష్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సీడల్ నిలిచాడు. 17 మ్యాచ్‌ల్లో కేవలం 17.73 సగటుతో మొత్తం 30 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన సెయిడ్ల్.. ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండగలడు.

3. జాసన్ సంఘా:
2018 అండర్-19 ప్రపంచకప్‌లో తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఫైనల్‌కు చేర్చిన జాసన్ సంఘా పేరు కూడా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ మెగా వేలంలో సంఘ భారీ మొత్తం దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈసారి బీబీఎల్‌లో అతని బ్యాట్ రెచ్చిపోయింది. కుడిచేతి వాటం ఆటగాడు 12 మ్యాచ్‌లలో 49.44 సగటు, 132 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 445 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. 22 ఏళ్ల జాసన్ సంఘ టాప్ ఆర్డర్‌లో తుఫాను బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్‌తోనూ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. బీబీఎల్‌లో 4 వికెట్లు కూడా తీశాడు.

4. అష్టన్ అగర్:
అష్టన్ అగర్ ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. బీబీఎల్‌లో అగర్ తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆడుతున్న అతను కేవలం 15 మ్యాచ్‌ల్లో 21.89 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు. లెగ్ స్పిన్నర్‌గానే కాకుండా, 28 ఏళ్ల అష్టన్ అగర్ లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడు. టీ20 ఫార్మాట్‌లో అతని స్ట్రైక్ రేట్ దాదాపు 117గా నిలిచింది. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఆస్ట్రేలియన్ జట్టులోని కీలక ఆటగాళ్లలో అగర్ ఒకడు. మెగా వేలంలో ఈ ఆటగాడికి ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

5. డేనియల్ సామ్స్:
జాబితాలో చివరి స్థానంలో ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ నిలిచాడు. BBL సమయంలో, సామ్స్ బంతి, బ్యాట్ రెండింటితో పలు సంచలనాలు సృష్టించాడు. 15 మ్యాచ్‌ల్లో దాదాపు 162 స్ట్రైక్ రేట్‌తో 191 పరుగులు చేయడంతోపాటు, 24.57 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఐపీఎల్ మెగా వేలంలో డేనియల్ సామ్స్ భారీ మొత్తాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. గత ఏడాది IPL 2021 సందర్భంగా RCB సామ్స్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.

Also Read:IND vs WI: అహ్మదాబాద్‌ వన్డేలో టీమిండియా స్పెషల్ రికార్డు.. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌లకూ సాధ్యం కాలే.. అదేంటంటే?

IND vs WI: భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌ల్లో పరుగుల వరద.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?