ఐపీఎల్ 2022 కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్లను ప్రకటించాయి. రెండు కొత్త ఫ్రాంచైజీలు – అహ్మదాబాద్, లక్నో కూడా తమ ముగ్గురు ఆటగాళ్లను ప్రకటించాయి. మొత్తం 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని జట్లు రాబోయే సీజన్‌కు తమ జట్టు కెప్టెన్లను ప్రకటించలేదు. కెప్టెన్ ఫిక్స్ అయిన జట్లు ఏవి, కెప్టెన్ ఫిక్స్ కాని జట్లు ఏవో చూద్దాం రండి.
IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్ల కెప్టెన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. 2008 నుంచి చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి కూడా కెప్టెన్‌గా కనిపించనున్నాడు. గత సంవత్సరం అతని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది తన చివరి సీజన్ కాదని అతను సూచించాడు. ఈసారి ఫ్రాంచైజీ కూడా అతడిని రిటైన్ చేసుకుంది. అతని కెప్టెన్సీలో చెన్నై నాలుగుసార్లు ఐపీఎల్ టైటీల్ను గెలుచుకుంది. అదే సమయంలో ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కూడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఢిల్లీ గత సీజన్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయ్యర్ కోలుకున్న తర్వాత కూడా పంత్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి ఢిల్లీ అయ్యర్‌ను నిలబెట్టుకోలేదు. పంత్‌ను మాత్రం తమతో ఉంచుకుంది. వచ్చే సీజన్‌లో పంత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ చేతిలో ఉంటుంది. డేవిడ్ వార్నర్ స్థానంలో గత సీజన్ మధ్యలో అతనికి కెప్టెన్సీని అప్పగించారు.
గత సీజన్‌లో రాజస్థాన్ సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడింది. ఫ్రాంచైజీ అతనిని ఈ సీజన్‌లో కూడా ఉంచుకుంది ఈసారి కూడా అతను జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది. కానీ KKR మోర్గాన్‌ను కొనసాగించలేదు. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో చూడాలి.
విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే బెంగళూరు కెప్టెన్‌గా ఐపీఎల్-2021 తన చివరి సీజన్ అని గత సీజన్ మధ్యలో చెప్పాడు. ఈసారి కొత్త కెప్టెన్‌తో RCB బరిలోకి దిగనుంది. కెఎల్ రాహుల్ రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఈసారి అతను జట్టు నుండి వైదొలగాడు. ఆ జట్టు కూడా కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు.
IPL-2022లో లక్నో, అహ్మదాబాద్ ప్రాచైజీలో పాల్గొంటున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసిన ఆటగాళ్లు, కెప్టెన్‌లను ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also.. IPL 2022 Mega Auction: షమీ నుంచి బౌల్ట్ వరకు.. వేలంలో కాసుల వర్షం కురిపించే బౌలర్లు ఎవరంటే?