ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కేఎల్ రాహుల్(KL Rahul) నాయకత్వంలో రంగంలోకి దిగనుంది. ఐపీఎల్ లీగ్‌కు ఈ జట్టు కచ్చితంగా కొత్తదే. కానీ, ఈ జట్టులో చేరిన ఆటగాళ్లు మాత్రం టీ20లో దుమ్మురేపిన వారే. లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ లాంటి కెప్టెన్ ఉండగా, క్వింటన్ డి కాక్ లాంటి వికెట్ కీపర్ కూడా ఉండడంతో, తొలిసారే ట్రోఫీ అందుకుంటుందని భావిస్తున్నారు. అలాగే మార్కస్ స్టోయినిస్ లాంటి తుఫాన్ ఆల్ రౌండర్ ఈ జట్టు బలాన్ని మరింత పెంచుతాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. లక్నో జట్టు తన తొలి మ్యాచ్‌ని మార్చి 28న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో టీం బరిలోకి దిగనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో తుఫాను ఓపెనర్లు, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు, అంతకుమించిన స్పిన్నర్లతోపాటు ఆల్ రౌండర్లు ఉన్నారు. అలాగే, ఈ జట్టు గౌతమ్ గంభీర్ వంటి మెంటార్ సేవలను పొందుతోంది. అతని నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక రాహుల్ సారథ్యంలోని లక్నో టీం ప్లేయర్లు ఎలా ఉన్నారు, ట్రోఫీ కోసం ఎలాంటి ప్లాన్స్‌తో బరిలోకి దిగనున్నారు, అలాగే అసలు లక్నో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోంది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లక్నో బ్యాట్స్‌మెన్స్..
కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ లక్నో జెయింట్స్ తరపున ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగే చాన్స్ ఉంది. మనీష్ పాండే 3వ స్థానంలో, మార్కస్ స్టోయినిస్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు. ఇది కాకుండా, దీపక్ హుడా ఫినిషర్ పాత్రలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండనున్నాడు.
లక్నో ఆల్ రౌండర్స్..
లక్నోలో జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా లాంటి ఇద్దరు అద్భుతమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. వీరితో పాటు మార్కస్ స్టోయినిస్ కూడా బాగా బౌలింగ్ చేయగల సత్తా కలిగి ఉన్నాడు.
లక్నో బౌలర్లు..
లక్నో టీం ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ప్లేయింగ్ XIలోకి ప్రవేశించవచ్చు. ఇందులో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కూడా ఉండే అవకాశం ఉంది. వీరే కాకుండా మార్క్ వుడ్, అవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్‌లో ఈ జట్టుకు అండగా ఉండనున్నారు.
లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI – కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, షాబాజ్ నదీమ్, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఐపీఎల్ 2022 లక్నో సూపర్‌జెయింట్స్ షెడ్యూల్..
మార్చి 28- vs గుజరాత్ టైటాన్స్ (రాత్రి 7.30)
మార్చి 31- vs చెన్నై సూపర్ కింగ్స్ (రాత్రి 7.30)
ఏప్రిల్ 4- vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (రాత్రి 7.30)
ఏప్రిల్ 7- vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7.30)
10 ఏప్రిల్- vs రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7.30)
16 ఏప్రిల్- vs ముంబై ఇండియన్స్ (మధ్యాహ్నం 3.30)
19 ఏప్రిల్- vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాత్రి 7.30)
24 ఏప్రిల్- vs ముంబై ఇండియన్స్ (రాత్రి 7.30)
29 ఏప్రిల్- vs పంజాబ్ కింగ్స్ (రాత్రి 7.30)
మే 1 vs ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3.30)
మే 7- vs కోల్‌కతా నైట్ రైడర్స్ (రాత్రి 7.30)
మే 10- vs గుజరాత్ టైటాన్స్ (పూణె – రాత్రి 7.30)
మే 15- vs రాజస్థాన్ రాయల్స్ (రాత్రి 7.30)
మే 18- vs కోల్‌కతా నైట్ రైడర్స్ (రాత్రి 7.30)
Also Read: