IPL 2022 Lucknow Franchise: ఐపీఎల్ 2022 (IPL 2022)లో అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ(Lucknow Franchise), దాని మొదటి 3 ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఫ్రాంచైజీ భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. అదే సమయంలో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను కూడా కొనుగోలు చేశారు. ఏడు వేల కోట్లకు పైగా ధరతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా అవతరించిన గోయెంకా గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంచైజీ రాహుల్‌ను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తం వెచ్చించింది. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ రాహుల్‌ను లక్నో కెప్టెన్‌గా రూ.17 కోట్లకు కొనుగోలుకు చేసింది.
అదే సమయంలో, ఆస్ట్రేలియాను టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై కూడా ఫ్రాంచైజీ చాలా ఖర్చు చేసింది. లక్నో రూ. 9.2 కోట్లతో ఈ బలమైన ఆస్ట్రేలియన్‌పై సంతకం చేసింది. అదే సమయంలో, యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి అత్యంత షాకింగ్.. కానీ, ఉత్తమ నిర్ణయం. 2020లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన బిష్ణోయ్‌ను ఫ్రాంచైజీ 4 కోట్లకు కొనుగోలు చేసింది. బిష్ణోయ్ ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్. దీని తర్వాత లక్నో వేలానికి దాదాపు రూ.59 కోట్లు మిగిలే ఉంది.
త్రీ-ఇన్-వన్ ప్లేయర్‌గా రాహుల్..
రాహుల్‌ను లక్నో జట్టు కెప్టెన్‌గా చేస్తుందని కొంతకాలంగా చర్చ నడుస్తుంది. అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ లక్నో ఫ్రాంచైజీ ముగ్గురు ప్లేయర్లను ప్రకటించింది. గత రెండు సీజన్లలో రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో పంజాబ్ జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. అయితే, గత 3-4 వరుస సీజన్లలో లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రాహుల్ ఉన్నాడు. రాహుల్ రాకతో, కెప్టెన్సీతో పాటు, బలమైన ఓపెనర్‌తోపాటు గొప్ప వికెట్ కీపర్ స్థానం లక్నోతో భర్తీ చేశారు.
స్టోయినిస్, బిష్ణోయ్ కూడా..
అదే సమయంలో, లక్నో మార్కస్ స్టోయినిస్‌ను తన రెండవ ఆటగాడిగా ఎంచుకుంది. స్టోయినిస్ పేరు కూడా చర్చనీయాంశమైంది. ఇది కూడా ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గత రెండు ఐపిఎల్ సీజన్లలో మెరుగ్గా ఉంది. అతని ప్రదర్శన సహాయంతో, ఢిల్లీ క్యాపిటల్స్ 2020 సీజన్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆస్ట్రేలియా తరఫున ప్రపంచకప్‌లో తన బ్యాట్‌తో బలమైన ఆటను ప్రదర్శించాడు.
లక్నో ఉత్తమ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌ను కూడా కొనుగోలు చేసింది. బిష్ణోయ్ గత రెండు సీజన్లలో రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ తరపున ఆడాడు. పంజాబ్ అయితే బిష్ణోయ్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అన్ని మ్యాచ్‌లు ఆడనివ్వలేదు. అయితే తన అద్భుతమైన గూగ్లీతో గుర్తింపు పొందిన బిష్ణోయ్‌ను కేవలం రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.
We wanted the best and we didn’t settle for less. ??#TeamLucknow #IPL2022 @klrahul11 @MStoinis @bishnoi0056 pic.twitter.com/p9oM8M9tHy
— Official Lucknow IPL Team (@TeamLucknowIPL) January 21, 2022
Also Read: IPL 2022: అహ్మదాబాద్ సారథిగా భారత ఆల్‌రౌండరే.. ముగ్గురు ప్లేయర్లను ప్రకటించిన ఫ్రాంచైజీ.. వారెవరంటే?