
IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా వేలం (IPL 2022 Mega Auction) ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనుంది. ఈ మెగా వేలంలో లీగ్‌లోని మొత్తం 10 జట్లు భారీగా ఖర్చు చేయబోతున్నాయి. ఒక అద్భుతమైన టీమ్‌ని తయారు చేయడం మాత్రమే లక్ష్యంగా ఈ మెగా వేలం జరగనుంది. 15వ సీజన్ వేలానికి ముందు, ఇప్పటి వరకు బిడ్డింగ్ కోసం జట్టు ఎంత డబ్బు వెచ్చించించాయో ఇప్పుడు చూద్దాం. (PTI)

ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా రూ.821.55 కోట్లు వెచ్చించింది. ఈ జట్టు ఎప్పుడూ ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తూనే ఉంది. కానీ, ఈ జట్టు ఇప్పటి వరకు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో వేలంలో రూ. 800 కోట్లకు పైగా వెచ్చించిన ఏకైక జట్టుగా బెంగళూరు నిలిచింది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ముంబై ఇప్పటివరకు రూ.794.49 కోట్లు ఖర్చు చేసింది. 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ను గెలుచుకున్న ముంబై.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు రూ.769.29 కోట్లు వెచ్చించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2012, 2014లో కోల్‌కతా ఐపీఎల్‌ను గెలుచుకుంది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు రూ.740.05 కోట్లు వెచ్చించినా.. ఈ జట్టు ఇప్పటి వరకు ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. 2020 సంవత్సరంలో, జట్టు మొదటిసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో టైటిల్ దూరమైంది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.686.56 కోట్లు వెచ్చించింది. ఈ జట్టు గత రెండు సీజన్లలో ఆటగాళ్లపై కనక వర్షం కురిపించింది. అయితే ఫ్రాంచైజీ రెండుసార్లు కూడా ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.554.67 కోట్లు వెచ్చించింది. ఈ జట్టు 2016లో మాత్రమే టైటిల్ గెలుచుకుంది. (PC-Instagram)

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్‌లో ఇప్పటివరకు రూ. 524.29 కోట్లు ఖర్చు చేసింది. ఈ జట్టు ఒకసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ విజేతగా నిలిచింది. (PC-Instagram)

ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.674.43 కోట్లు వెచ్చించింది. ధోని సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటి వరకు 4 సీజన్లలో విజయం సాధించింది. 2010, 2011, 2018, 2021లో చెన్నై ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. (PC-Instagram)