Hardik Pandya: ధోనికి జిరాక్స్‌.. అచ్చం అలానే చేస్తున్నాడు.. హార్దిక్‌పై సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు..

|

Jun 01, 2022 | 7:26 AM

ఆఖరి మ్యాచ్‌లో హార్దిక్ బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. అతను సీజన్ అంతటా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కీలకమైన నంబర్ 4లో ఆడాడు.

Hardik Pandya: ధోనికి జిరాక్స్‌.. అచ్చం అలానే చేస్తున్నాడు.. హార్దిక్‌పై సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు..
Hardik Pandya
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022)లో తన అద్భుతమైన కెప్టెన్సీతో అందరి హృదయాలను గెలుచుకున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గాయం నుంచి కోలుకుని, అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్‌తోపాటు కెప్టెన్సీలోనూ రాణించి, అరంగేట్రంలోనే గుజరాత్ టీం ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈమేరకు హార్దిక్‌ను ఫ్యూచర్ టీమిండియా(Team India Captain) కెప్టెన్ అంటూ పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా ఓ కీలక ప్రకటన చేశాడు. హార్దిక్ కెప్టెన్సీలో ధోనీ ఇమేజ్ కనిపిస్తోందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో పేర్కొన్నాడు. హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అత్యుత్తమం..

“ఆఖరి మ్యాచ్‌లో హార్దిక్ బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. అతను సీజన్ అంతటా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కీలకమైన నంబర్ 4లో ఆడాడు. అతని కెప్టెన్సీలో ధోనీ కనిపించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ చాలా ప్రశాంతంగా కనిపించి జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నాడు. అతను కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్లు, చాలా ప్రశాంతంగా కనిపించాడు. ధోని మాత్రమే ఇలా చేస్తాడంటూ” ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఫీల్డింగ్, బౌలింగ్‌లో ధోని లాగే..

మంజ్రేకర్ మాట్లాడుతూ, పాండ్యా ఫీల్డింగ్, బౌలింగ్‌లో మార్పులు చేస్తున్నాడు. చాలా వరకు ధోనీ ఇలాగే చేసేవాడు’ అంటూ తెలిపాడు. హార్దిక్ గుజరాత్ కంటే ముందు ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. కానీ, ఈ సంవత్సరం అతన్ని ముంబై జట్టు రిటైన్ చేసుకోలేదని తెలిసిందే.

భారత్ టీ20 ప్రపంచకప్ గెలవాలి..

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత హార్దిక్ తదుపరి లక్ష్యం టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలవడమేనంటూ ప్రకటించాడు. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత హార్దిక్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ‘ఏదేమైనప్పటికీ నేను టీమ్ ఇండియా కోసం ప్రపంచ కప్ గెలవాలి. ఇందుకోసం నా తరపు నుంచి 100 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను టీమ్ ఇండియాతో గుర్తింపు పొందాను. టీమ్‌ఇండియాకు ఆడటంతో నా కల నిజమైంది. నేను భారత్‌ తరపున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాను అన్నది ముఖ్యం కాదు, నా జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడల్లా అది నాకు గర్వకారణంగా నిలుస్తుంది. నాకు లభించిన ప్రేమ, మద్దతు అంతా టీమిండియా వల్లే సాధ్యమైంది. అందుకే ఎలాగైనా టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.