IPL 2022: ‘అతను మరో మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌గా క్లైమాక్స్‌లో విధ్వంసం’

|

May 03, 2022 | 5:06 PM

గుజరాత్ టైటాన్స్ తరపున రెండు అద్భుతమైన మ్యాచ్‌లు గెలిచిన రాహుల్ తెవాటియా.. ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈమేరకు మాజీలు తెవాటియాను క్లైమాక్స్‌లో విధ్వంసం చేసే మరో ధోని అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు.

IPL 2022: అతను మరో మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌గా క్లైమాక్స్‌లో విధ్వంసం
Ipl 2022 Gujarat Titans Rahul Tewatia
Follow us on

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తరపున రెండు అద్భుతమైన మ్యాచ్‌లు గెలిచిన రాహుల్ తెవాటియా(Rahul Tewatia).. ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈమేరకు మాజీలు తెవాటియాను క్లైమాక్స్‌లో విధ్వంసం చేసే మరో ధోని అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆటగాడి ఆటకు ఫిదా అయిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్‌( Sunil Gavaskar) ‘ఐస్‌మ్యాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. రాహుల్ తెవాటియా క్లిష్ట పరిస్థితుల్లోనూ భయపడకుండా, మంచులా చల్లగా ఉంటాడని, ఇదే తన విజయ మంత్రమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. షార్జాలో IPL 2020 సందర్భంగా షెల్డన్ కాట్రెల్‌ వేసిన ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టడంతో రాహుల్ తెవాటియా.. తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ తరపున తెవాటియా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అలాగే, భారత T20 జట్టులో అతని ఎంపికకు బలమైన వాదన కూడా వినిపిస్తోంది.

గవాస్కర్ ‘స్టార్ స్పోర్ట్స్’తో మాట్లాడుతూ, ‘షార్జాలో షెల్డన్ కాట్రెల్‌పై సిక్స్‌లు కొట్టి, అతను అసాధ్యాలను సుసాధ్యం చేయగలడనే విశ్వాసాన్ని తెవాటియాకు ఇచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం చూశాం. డెత్ ఓవర్లలో తెవాటియా బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తోంది. అతను బంతి వచ్చే వరకు వేచి ఉండి, భారీ షాట్లు ప్లాన్ చేసి, ఆడతాడు. అతను అన్ని షాట్‌లను కలిగి ఉన్నాడు. అయితే, సంక్షోభ సమయాల్లో తన నిగ్రహాన్ని కోల్పోకుండా సత్తా చాటుతున్నాడు.

ఈ మేరకు గవాస్కర్ ఈ యంగ్ ప్లేయర్‌కు ‘ఐస్ మ్యాన్’ అనే ముద్దుపేరు పెట్టారు. అతను క్రీజులో ఉన్నప్పుడు అస్సలు భయపడడు. కాబట్టి నేను అతన్ని ఐస్ మ్యాన్ అని పిలుస్తాను. అతను బంతిని పసిగట్టాడు. ఏ షాట్ ఆడాలో బాగా తెలుసు అని ఆయన అన్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ప్లేఆఫ్‌ బరిలో కొత్త జట్లు.. లిస్టులో చేరిన మరో రెండు.. 47 మ్యాచ్‌ల తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?

IPL 2022, Orange Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన శ్రేయాస్‌ అయ్యర్.. వెనుకబడిన హార్దిక్ పాండ్య..!