IPL 2022: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీస్ చేసిన ప్లేయర్లు వీరే..!

|

Mar 20, 2022 | 5:57 AM

IPL 2022: క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి క్రికెట్ సంబరం త్వరలో ప్రారంభంకోబోతుంది. ఐపీఎల్‌ ప్రారంభానికి మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. కప్పు

IPL 2022: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీస్ చేసిన ప్లేయర్లు వీరే..!
Fastest 50s In Ipl
Follow us on

IPL 2022: క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి క్రికెట్ సంబరం త్వరలో ప్రారంభంకోబోతుంది. ఐపీఎల్‌ ప్రారంభానికి మరికొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. కప్పు ఎలా కొట్టాలో ఆటగాళ్లు, ప్రాంచైజీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరుతున్నారు. ఇక ఈ వేసవిలో క్రికెట్‌ అభిమానులకి పండుగే పండుగ. అయితే ఐపీఎల్ చరిత్రలో బౌలర్ల కంటే బ్యాట్స్‌మెన్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసినవారే హీరోలవుతారు. ఈ లెక్కన ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీలలో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల గురించి ఓ లుక్కేద్దాం. అందులో మొదటగా కేఎల్‌ రాహుల్‌ గురించి చెప్పుకోవాలి. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించాడు. 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి నాలుగేళ్లుగా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. 2018లో పంజాబ్‌ జట్టు తరఫున ఆడిన అతడు దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించడం విశేషం.

తర్వాతి స్థానంలో మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్ ఉన్నాడు. 2014లో అతడు కోల్‌కతా తరఫున ఆడగా సన్‌రైజర్స్‌తో తలపడిన ఓ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రాహుల్‌ 2018లో ఈ రికార్డును బద్దలుకొట్టనంత వరకూ యూసుఫ్‌ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌. ఇతడు కూడా యూసుఫ్‌ లానే 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 2017లో బెంగళూరుతో జరిగిన ఓ మ్యాచ్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. మొత్తం 17 బంతులు ఎదుర్కొని‌.. 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌తో సుధీర్ఘకాలం ఎవరికైనా సంబంధం ఉందంటే అతడు సురేశ్ రైనా మాత్రమే. 2014లో చెన్నై తరఫున ఆడిన రైనా పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఆటగాడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 25 బంతులు ఎదుర్కొన్న రైనా.. 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో మొత్తం 87 పరుగులు చేశాడు. ఇక ఐదో స్థానంలో ముంబయి బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. గతేడాది సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఆడిన ఇషాన్‌ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు.

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..