CSK vs SRH Score, IPL 2022: హైదరాబాద్ ముందు భారీ టార్గెట్.. ధోనీ జట్టు చెక్ పెట్టేనా..?

|

May 01, 2022 | 10:04 PM

చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (99), డేవన్‌ కాన్వే (85*) అదరగొట్టడంతో హైదరాబాద్‌కు చెన్నై భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

CSK vs SRH Score, IPL 2022: హైదరాబాద్ ముందు భారీ టార్గెట్.. ధోనీ జట్టు చెక్ పెట్టేనా..?
Ruturaj Gaikwad
Follow us on

చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (99), డేవన్‌ కాన్వే (85*) అదరగొట్టడంతో హైదరాబాద్‌కు చెన్నై భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 203 పరుగులను లక్ష్యంగా ఉంచింది. చెన్నై ఓపెనర్లు తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రుతురాజ్‌ కాస్తలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌కే రెండు వికెట్లు పడ్డాయి.

గైక్వాడ్ సెంచరీ మిస్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వాయ్ లు బ్యాటింగ్‌కు వచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 17.5 ఓవర్లలో 182 పరుగులు జోడించారు. అయితే గైక్వాడ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. 99 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 6 ఫోర్లు, 6 సిక్సర్లు వచ్చాయి.

ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, ఎక్కువసేపు భారీ షాట్లు కొట్టలేకపోయిన అతను ఏడు బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో ఎనిమిది పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు డెవాన్ కాన్వే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా ఒక్క పరుగుతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున టి నటరాజన్ తన నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, భువనేశ్వర్ తన నాలుగు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇది కాకుండా, ఉమ్రాన్ మాలిక్ తన నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. 

ఇవి కూడా చదవండి: Telangana: పోలీసు ఉద్యోగ అభ్యర్థులు అలర్ట్‌.. తస్మాత్‌ జాగ్రత్త.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..