ఐపీఎల్ 2022(IPL 2022) లో చాలా మార్పులు వచ్చాయి. CSK కెప్టెన్ విషయంలో తాజాగా మార్పు జరిగింది. ఎంఎస్ ధోని స్థానంలో రవీంద్ర జడేజా జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కొత్త పాత్రలో అతనికి ఈరోజు మొదటి పరీక్ష. ప్రస్తుతం జడేజా కెప్టెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు ఛాన్సులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)టీం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)ను ఓడిస్తే.. అరంగేట్రంలోనే జడేజా తన కెప్టెన్సీని నిరూపించుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు జెర్సీ ధరించిన ఈ 36 ఏళ్ల ఆటగాడు.. జడేజాకు ఓ ఆయుధంలా మారుతాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన ఈ 36 ఏళ్ల ఆటగాడు మరెవరో కాదు.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు. కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో రాయడు చెన్నైకి కీలకమైన ఆయుధంగా నిరూపించుకోవచ్చు. అతను తన బ్యాట్‌తో సత్తా చాటితే ఇక తిరుగుండదు.
వాంఖడేలో రాయుడు రికార్డులు..
వాంఖడే వేదికగా అంబటి రాయుడు 48 ఇన్నింగ్స్‌ల్లో 126.79 స్ట్రైక్ రేట్‌తో 885 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 5 అర్ధ సెంచరీలు, 78 ఫోర్లు, 35 సిక్సర్లు కొట్టాడు. వాంఖడేలో 59 పరుగులు రాయుడు అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. రోహిత్ 61 ఇన్నింగ్స్‌ల్లో 1733 పరుగులు చేయగా, పొలార్డ్ 56 ఇన్నింగ్స్‌ల్లో 1207 పరుగులు చేశాడు. KKR జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా వాంఖడేలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5లో లేకపోవడం విశేషం.
ఐపీఎల్ పిచ్‌పై రాయుడు రికార్డు..
అంబటి రాయుడికి 175 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్ పిచ్‌పై 164 ఇన్నింగ్స్‌ల్లో 3916 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేట్ 127.47గా నిలిచింది. అతని బ్యాట్ నుంచి ఒక సెంచరీ, 21 అర్ధ సెంచరీలు రాలాయి. ఐపీఎల్‌లో చేసిన 3916 పరుగులలో వాంఖడేలో రాయుడు 885 పరుగులు చేశాడు. అంటే ఈ మైదానంలో అతని రికార్డు ఎలా ఉందో తెలియజేస్తుంది.
ఈరోజు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో అంబటి రాయుడు సీఎస్‌కే ట్రంప్ కార్డు కాగలడని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. జడేజా తన కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాలని కోరుకుంటే, రాయుడు బ్యాట్ జోరు చూపించాలి. వాంఖడేపై అతని రికార్డును పరిగణనలోకి తీసుకుంటే, అది సాధ్యమేనని తెలుస్తోంది.