IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన గంగూలీ.. ఫ్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు..

క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) సీజన్‌ నెల రోజులు పూర్తి చేసుకుంది. గత నెల 26న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన గంగూలీ.. ఫ్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు..
Ipl 2022

Edited By:

Updated on: Apr 24, 2022 | 9:10 AM

క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) సీజన్‌ నెల రోజులు పూర్తి చేసుకుంది. గత నెల 26న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు (ఏప్రిల్‌ 24) 36 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కాగా మే 22న జరిగే సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో లీగ్‌ మ్యాచ్‌లు పూర్తవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఈక్రమంలో తాజాగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ బీసీసీఐ ప్రకటించింది. శనివారం జరిగిన BCCI అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్లే ఆఫ్స్‌, ఫైనల్ మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బీసీసీఐ అధ్యక్షుడు ప్రకటించారు.  కాగా కరోనా నేపథ్యంలో లీగ్ మ్యాచ్ లకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అయితే  నాకౌట్ మ్యాచ్ లకు మాత్రం 100 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు గంగూలీ తెలిపారు.

అహ్మదాబాద్‌లో ఫైనల్‌..

కాగా కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికల(ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం, వాంఖడే, బ్రబౌర్న్‌ స్టేడియం, పూణేలోని ఎంసీఏ స్టేడియం)కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికలను విస్తరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో జరగనున్నాయి. మే 24 క్వాలిఫయర్‌, మే 26న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇదే వేదికలోనే మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లకు వందశాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నారు.

Also Read: RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Pawan: నన్ను దత్తపుత్రుడు అంటే ఊరుకునేది లేదు.. వైసీపీ పై నిప్పులు కురిపించిన పవన్