IPL 2021: కోహ్లీ టీం జెర్సీ మారింది.. కేకేఆర్‌తో పోరుకు మాత్రమేనట.. ఎందుకో తెలుసా?

|

Sep 14, 2021 | 1:19 PM

RCB vs KKR: ఐపీఎల్ రెండో దశ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సారి విరాట్ కోహ్లీ టీం కాస్తా ఢిపరెంట్‌గా కనిపించనుంది.

IPL 2021: కోహ్లీ టీం జెర్సీ మారింది.. కేకేఆర్‌తో పోరుకు మాత్రమేనట.. ఎందుకో తెలుసా?
Rcb Players
Follow us on

RCB vs KKR: ఐపీఎల్ 2021 రెండవ దశ కోసం యూఏఈలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పిటికే అక్కడి చేరుకున్న అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కొంతమంది ప్లేయర్లు ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 19 నుంచి ఈ లీగ్ మొదలుకానుంది. చెన్నై వర్సెస్ ముంబై టీంల మధ్య మ్యాచ్‌తో పోటీలు ప్రారంభంకానున్నాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ టీం సెప్టెంబర్ 20 న కేకేఆర్‌తో తమ మొదటి తొలి పోరాటానికి సిద్ధమవుతోంది. అయితే మొదటి దశలో కనిపించిన ఆర్‌సీబీ టీంలో ఓ మార్పు వచ్చింది. కొత్త లుక్‌లో రెండవ దశలో బరిలోకి దిగనున్నారు. బ్లూ కలర్ జెర్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కనిపించనుంది. తొలి దశలో ఎరుపు జెర్సీలో కనిపించిన కోహ్లీ టీం.. నీలం రంగు జెర్సీలో కనిపించనున్నారు. అయితే ఇది ఈ ఒక్క మ్యాచ్ కోసం మాత్రమేనని టీం పేర్కొంది. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు మద్దతు ఇవ్వడం కోసం బ్లూ జెర్సీని ధరిస్తున్నట్లు టీం పేర్కొంది.

ఐపీఎల్ 2021 మొదటి దశలో కూడా, కెప్టెన్ విరాట్ కోహ్లీ టీం కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ కార్మికులకు పూర్తి ఉత్సాహంతో మద్దతు ఇచ్చారు. లైట్ బ్లూ రంగు జెర్సీ ధరించడం ద్వారా వారికి మద్దతు ఇచ్చారు. ఫ్రంట్‌లైన్ కార్మికులకు మద్దతుగా లేత నీలం రంగు జెర్సీని ధరిస్తుంది. ఎందుకంటే ఈ జెర్సీ రంగు PPE కిట్‌తో సరిపోతుందని టీం పేర్కొంది. హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి తన ఫ్రాంఛైజీ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుందని కోహ్లీ ప్రకటించాడు.

బెంగుళూరుతో పాటు దేశంలోని ఇతర నగరాలకు ఆక్సిజన్ అందించడానికి ఆర్‌సీబీ గివ్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి 100 యూనిట్ల వరకు ఆక్సిజన్ ఫ్లాంట్లను ఏర్పాటు చేసింది.

ఐపీఎల్ 2021 లో యూఏఈ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించడానికి ఆర్‌సీబీ జట్టు సిద్ధమైంది. ప్లే-ఆఫ్‌కు ఒక అడుగు దగ్గరగా ఉండాలనేది వారి ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత విరాట్ కోహ్లీ జట్టుతో చేరాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు.

Also Read: Namanveer Singh Brar: భారత షూటర్ అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యగా భావిస్తోన్న పోలీసులు..?

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌గా ఇంగ్లండ్ కెప్టెన్‌.. కలిసొచ్చిన టీమిండియా సిరీస్