కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వితీయార్థంలో వెంకటేశ్ అయ్యర్ అత్యుత్తమంగా ఆడారని ప్రశంసించారు. ఐపీఎల్-2021 మొదటి దశలో కోల్‌కతా ఏడు మ్యాచులు ఆడి కేవలం రెండింటిలో విజయం సాధించింది. కానీ రెండో దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించింది. దీనికి కారణం వెంకటేశ్ అయ్యర్ అని మెక్‌కల్లమ్ అన్నారు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంకటేశ్ 10 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. సీజన్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
“దూకుడుగా ఉండడం ‘వెంకటేష్ అయ్యర్ గేమ్ ప్లాన్’ అతను ఒక పొడవైన వ్యక్తి, ఒక రకమైన కావలీయర్ స్ట్రీక్‌తో గేమ్ ఆడుతాడు” అని అన్నాడు “అతను అత్యంత స్థిరంగా ఉండకపోవచ్చు కానీ మనం ఇప్పటివరకు చూసిన వెంకటేశ్ అయ్యర్‌గానే ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ క్రికెట్లో అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది. అతను చాలా తెలివైన వ్యక్తి. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరేందుకు అతను బాగా ఆడాడు” అని చెప్పారు. సీజన్‌లోని కేకేఆర్‌కు మంచి విరామం వచ్చింది. ఈ విరామంలో బాగా ఇఫ్రువ్ అయ్యామని మెకల్లమ్ చెప్పాడు.” మేము ఏడు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు సాధించాం. మంచి సమయంలో విరామం వచ్చింది. కొన్ని కఠినమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి ఈ విరామంలో ప్రయత్నించామని మెకల్లమ్ అన్నారు.
“ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం మా ఉద్దేశం పెంచాల్సిన అవసరం ఉందని ఎప్పుడూ భావిస్తున్నాను. టోర్నమెంట్ ద్వితీయార్ధంలో మా నలుగురు భారత ఆటగాళ్లు సాధించిన విజయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. వారు ఆడిన విధంగా ఆడటానికి ధైర్యం కావాలి. వారు ఖచ్చితంగా అద్భుతంగా ఆడారు “అని చెప్పాడు.
Read Also… Shardul Thakur: శార్దూల్ ఠాకూర్ బర్త్‌డే.. CSK టీం సభ్యులు ఏం చేశారో తెలుసా.. వైరలైన వీడియో..