IPL 2021, SRH vs PBKS: ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో 37వ మ్యాచులో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 126 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్ల ముందు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్(21 పరుగులు, 21 బంతులు, 3 ఫోర్లు) మంచి ఊపులో కనిపించాడు. కానీ, 4.1 ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇకే ఇదే వరుసలో మిగతా టీం అంతా కేఎల్ రాహుల్ వెంటే వరుస కట్టారు.
మయాంక్ అగర్వాల్ 5, గేల్ 14, మక్రాం 27, పూరన్ 8, దీపక్ హుడా 13, నాథన్ ఎల్లీస్12 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు. అలాగే బ్రార్ 18లతో నాటౌట్‌గా నిలిచాడు. కీలక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోవడంతో తక్కువ స్కోర్‌కే చేతులెత్తేశారు.
ఇక హైదరాబాద్ బౌలర్లలో జాన్సన్ హోల్డర్ 3 వికెట్లు, సందీప్ శర్మ, రషీద్ ఖాన్, అబ్దుల్ సమీద్, బువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read: విధ్వంసం..10 బంతుల్లో 54 పరుగులు.. 3 ఫోర్లు 7 సిక్సర్లు.. ఎవరు ఈ బ్యాట్స్‌మెన్..?