IPL 2021: ప్రస్తుతం ఐపీఎల్ 2021 ముగిసేందుకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్‌లు జరిగాయి. ప్రస్తుతం ఎలిమినేటర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక మ్యాచ్ పూర్తియింది. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ (CSK vs DC)ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అక్టోబర్ 11 సోమవారం నాడు ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) ను ఓడించి, రెండో క్వాలిఫయర్‌లో స్థానం సంపాదించుకుంది. దీంతో బెంగళూరు ప్రయాణం ముగిసింది. అయితే ఆరెంజ్ క్యాప్ అంటే లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే క్యాప్ గురించి మాట్లాడితే మాత్రం ఈ ప్లేఆఫ్ మ్యాచులు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఈ నాలుగు టీంల నుంచి ఏ బ్యాట్స్‌మెన్ కూడా నంబర్ వన్ కేఎల్ రాహుల్‌ని వెనక్కు నెట్టేయలేదు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
పరుగుల వర్షం ఈ సారి ఐపీఎల్‌లో కనిపించలేదు. అయినా కొంతమంది బ్యాట్స్‌మెన్‌లు మాత్రం బౌలర్లపై దాడి చేస్తూ ఆరెంజ్ క్యాప్ సాధించేందుకు పోటీపడ్డారు. గత కొన్ని సీజన్లలోనూ పంజాబ్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఈ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రుతురాజ్ గైక్వాడ్-ఫాఫ్ డు ప్లెసిస్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన శిఖర్ ధావన్ వంటి ఇతర బ్యాట్స్‌మెన్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు.
కేఎల్ రాహుల్‌కు తిరుగేలేదు..
పంజాబ్ కింగ్స్ టీం నిరాశపరిచినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఏమాత్రం అభిమానులను నిరాశపరచలేదు. తన ఆటతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. కానీ, ఇతర ప్లేయర్ల సహకారం లేకపోవడంతో పంజాబ్ టీం ఐపీఎల్‌లో రాణించలేకపోతోంది. సింగిల్‌గా పంజాబ్‌ను పోటీలో నిపిలిన రాహుల్.. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానం సాధించి, తగ్గేదేలే అంటూ దూసుకపోతున్నాడు. 2020లోనూ అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. 2019లో రెండో స్థానంలో నిలిచాడు.
2021- కేఎల్ రాహుల్ (PBKS) – 13 మ్యాచ్‌లు, 626 పరుగులు
2020- కేఎల్ రాహుల్ (PBKS) – 14 మ్యాచ్‌లు, 670 పరుగులు
పంజాబ్‌కు వచ్చే ఏడాది బైబై చెప్పనున్నాడా?
పంజాబ్ కింగ్స్ టీం నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోనున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కారణం ఇతర ప్లేయర్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పంజాబ్ టీం ప్లేఆప్ చేరుకోవడంలో విఫలమవుతోంది. కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరితే తరువాత టీంను ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌కు పంజాబ్ కింగ్స్ టీం నుంచి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మార్పు చూపని ఎలిమినేటర్ వన్ మ్యాచ్
బెంగళూరు వర్సెస్ కోల్‌కతా మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్ రేసును ఏమాత్రం ప్రభావితం చేయలేదు. టాప్ -5 బ్యాట్స్‌మెన్ల స్థానం అలాగే ఉంది. కేవలం 5 వ స్థానంలో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన పరుగుల సంఖ్యను 500 కి చేర్చాడు. ఈ సీజన్‌లో ఇది ఆర్‌సీబీకి అత్యధిక పరుగులు కావడం విశేషం. ప్రస్తుతం, ఆరెంజ్ క్యాప్ రేసులో 5గురు ఆటగాళ్లు ఉన్నారు.
కేఎల్ రాహుల్ (PBKS) – 13 మ్యాచ్‌లు, 626 పరుగులు
రితురాజ్ గైక్వాడ్ (CSK) – 15 మ్యాచ్‌లు, 603 పరుగులు
శిఖర్ ధావన్ (DC) – 15 మ్యాచ్‌లు, 551 పరుగులు
ఫాఫ్ డు ప్లెసిస్ (CSK) – 15 మ్యాచ్‌లు, 547 పరుగులు
గ్లెన్ మెక్‌క్వెస్‌వెల్ (RCB) -15 మ్యాచ్, 513 పరుగులు
Also Read: RCB vs KKR Eliminator Result: ఉత్కంఠ పోరులో చేతులెత్తేసిన బెంగుళూరు.. క్వాలిఫయర్‌కు చేరిన కేకేఆర్..