Rohit Sharma: ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయిన పర్వాలేదు.. కానీ 4 సార్లు ట్రోపీ గెలిచాం..

|

Oct 10, 2021 | 6:08 AM

Rohit Sharma: ఐపిఎల్ 2021 లీగ్ దశలో అత్యంత షాకింగ్ ఫలితం ఏదైనా ఉంటే అది ముంబై ఇండియన్స్ ఓటమి మాత్రమే. రెండుసార్లు

Rohit Sharma: ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయిన పర్వాలేదు.. కానీ 4 సార్లు ట్రోపీ గెలిచాం..
Rohit Sharma
Follow us on

Rohit Sharma: ఐపిఎల్ 2021 లీగ్ దశలో అత్యంత షాకింగ్ ఫలితం ఏదైనా ఉంటే అది ముంబై ఇండియన్స్ ఓటమి మాత్రమే. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌లు నాలుగు సార్లు టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టు మళ్లీ టైటిల్ సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ప్లే ఆఫ్స్‌లో చోటు సంపాదించలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది కొత్త జట్టు ఏర్పడుతుంది.

అటువంటి పరిస్థితిలో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు తరపున, ఇటు అభిమానుల తరపున ప్రత్యేక సందేశాన్నిచ్చారు.ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లే మా ప్రతిభకు నిదర్శనం కాదని ఇదే జట్టుతో గతంలో రెండుసార్లు ట్రోఫి గెలిచామని గుర్తు చేశారు. అంతేకాదు ఫ్లే ఆఫ్స్‌లో చోటు సంపాదించకపోయిన పర్వాలేదన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం మాకు సంతృప్తినిచ్చిందన్నారు. గెలుపు,ఓటములు ఆటలో సహజమని ముంబై జట్టులోని ఆటగాళ్లు గొప్ప ప్లేయర్లని కొనియాడారు. అలాగే అభిమానులు మాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారన్నారు.

జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, కిరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ వంటి అద్భుత ఆటగాళ్లు కలిసిన ముంబై జట్టు చివరి సీజన్‌ ఇదే కావొచ్చు. తర్వాత, వచ్చే ఏడాది పెద్ద వేలం జరగబోతోంది. ఇందులోకి రెండు కొత్త జట్లు రానున్నాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఆటగాళ్లు ఇతర జట్లలోకి వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ముంబై మరోసారి పాత, కొత్త ఆటగాళ్లతో బలమైన జట్టును సిద్ధం చేయాల్సి ఉంటుంది.

సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినా.. నెట్‌రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి వెళ్లలేకపోయింది. ముంబయి ఆటగాళ్లలో ఇషాన్‌ కిషన్‌ (84; 32 బంతుల్లో 11×4, 4×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (82; 40 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంతో ముంబయి 9 వికెట్ల నష్టానికి 235 పరుగుల స్కోరును సాధించింది. సన్‌రైజర్స్‌ 193 పరుగులకే పరిమితమైంది.

Maa Elections 2021: నాగబాబుకు మంచు విష్ణు కౌంటర్.. ‘కుటుంబం జోలికొస్తే సహించేది లేదు’..