IPL 2021: ఐపీఎల్‌ కోసం అబుదాబి చేరుకున్న రోహిత్‌ శర్మ.. సెప్టెంబర్ 19 న చెన్నై వర్సెస్‌ ముంబై ఇండియన్స్..

|

Sep 11, 2021 | 6:09 PM

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ చార్టర్ ప్లైట్‌లో

IPL 2021: ఐపీఎల్‌ కోసం అబుదాబి చేరుకున్న రోహిత్‌ శర్మ.. సెప్టెంబర్ 19 న చెన్నై వర్సెస్‌ ముంబై ఇండియన్స్..
Rohit Sharma
Follow us on

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ చార్టర్ ప్లైట్‌లో అబుదాబి చేరుకున్నారు. గతంలో కరోనా వల్ల ఆగిపోయిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు తమ కుటుంబాలతో కలిసి ఈరోజు ఉదయం అబుదాబి చేరుకున్నారు. ఐపిఎల్ మార్గదర్శకాల ప్రకారం 6 రోజులు నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తారు.

అబుదాబికి వచ్చిన తర్వాత వీరందరికి RT PCR పరీక్ష జరిగింది. ఇందులో అందరికి నెగిటివ్ వచ్చిందని ఫ్రాంచైజ్ తెలిపింది. సెప్టెంబర్ 19 న జరిగే మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. దీంతో ఐపీఎల్‌ సీజన్ తిరిగి ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో సెప్టెంబర్ 24 న షార్జాలో తలపడనుంది. మొత్తం మీద దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌లోని టోర్నమెంట్ బయో బుడగల్లో కోవిడ్ -19 కేసులు రావడంతో 2021 ఐపీఎల్ మొదటి సగం వాయిదా వేశారు.

ఇతర బృందాలు కూడా..
ఇతర జట్లు కూడా తమ ఆటగాళ్ల కోసం చార్టర్ విమానాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో మాంచెస్టర్ నుంచి యూఏ‌ఈకి ఆటగాళ్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ నుంచి యూఏఈ చేరుకోవాల్సి ఉంది. కానీ, భారత శిబిరంలో కరోనా కలకలంతో మొత్తం మారిపోయింది. ముందుగానే ఆటగాళ్లు యూఏఈ చేరుకోనున్నారు.

Gujarat New CM: గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త సీఎం కోసం కసరత్తు షురూ.. గాంధీనగర్‌కు అమిత్ షా!

Sai Dharam Tej Accident: చికిత్సకు స్పందించి స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. వీడియో..

Viral Video: డోర్ ఓపెన్ చేయగానే మహిళకు గట్టి షాక్.. కాటు వేసేందుకు ప్రయత్నించిన పాము.. వీడియో వైరల్.!