IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి షురూ.. తొలిరోజు రోహిత్‌తో తలపడనున్న ధోని.. బలాలు, బలహీనతలు ప్రివ్యూలో చూద్దాం!

|

Sep 19, 2021 | 3:08 PM

IPL 2021 MI vs CSK Match Preview: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఈ రికార్డును రోహిత్ శర్మ బృందం కొనసాగించాలని కోరుకుంటుంది.

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి షురూ.. తొలిరోజు రోహిత్‌తో తలపడనున్న ధోని.. బలాలు, బలహీనతలు ప్రివ్యూలో చూద్దాం!
Ipl 2021 Mi Vs Csk
Follow us on

IPL 2021 MI vs CSK: ఐపీఎల్ సందడి మరి కొద్ది గంటల్లో మొదలుకాబోతుంది. తొలిరోజే కీలక జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ రెండవ దశ ప్రారంభంకాభం కానుంది. కరోనావైరస్ కారణంగా మే 4 న నిలిచిపోయిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. గత సంవత్సరంలాగే యూఏఈలో ఐపీఎల్ జరగనుంది. రెండో దశలో మొదటి మ్యాచ్ టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK)టీంల మధ్య జరగనుంది. మూడుసార్లు ఛాంపియన్ చెన్నై టీం ఐదుసార్లు ఛాంపియన్ ముంబై టీంతో తలపడేందుకు సిద్ధమైంది.

ఎప్పుడు:చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI vs CSK), సెప్టెంబర్ 19, 2021, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

మీకు తెలుసా:

– ఐపీఎల్‌లో సీఎస్‌కెపై ఎక్కువ విజయాలు సాధించిన ఏకైక జట్టు ముంబై జట్టు మాత్రమే

– సురేష్ రైనా (820 పరుగులు), డ్వేన్ బ్రావో (28 వికెట్లు) ఐపీఎల్ చరిత్రలో ముంబైకి వ్యతిరేకంగా అత్యధిక పరుగులు, వికెట్లు తీసినవారు

రోహిత్ దే పైచేయి: ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఇతర జట్లతో పోలిస్తే అద్భుతంగా ఉన్నాయి. అయితే మైదానంలో పోటీ విషయానికి వస్తే, ధోనీ టీంపై రోహిత్ శర్మ ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. రికార్డులు ఖచ్చితంగా ముంబై టీం వైపే నిలిచాయి. ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ముంబై 19 విజయాలతో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో చెన్నై 13 సార్లు మాత్రమే గెలిచింది. మరి నేడు ఎవరు గెలుస్తారో చూడాలి.

నెమ్మదిగా మొదలెట్టి..
ఇప్పుడు రెండు జట్ల మధ్య ఉన్న తేడాలు గమనిద్దాం. వాస్తవానికి, ఈ మ్యాచ్ ఫలితం టోర్నమెంట్ దిశను నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇది టోర్నమెంట్ ప్రారంభం కాదు. ప్లేఆఫ్‌కు వెళ్లాలంటే మాత్రం అన్ని మ్యాచులు చాలా కీలకమైనవే. ఈ సీజన్ ముంబైకి మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ఇప్పటి వరకు ముంబై టీం 7 మ్యాచ్‌లలో 3 ఓడిపోయింది. టోర్నమెంట్ ఆగిపోయే సమయానికి, జట్టు కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రతీ సీజన్‌లో స్లోగా మొదలుపెట్టి కప్‌ను సొంతం చేసుకునే దిశగా సాగడంలో ముంబై టీం దిట్ట.

గత సీజన్ భయం వీడితేనే
చెన్నై విషయానికొస్తే, ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఉన్న ఈ జట్టు యూఏఈలో గత సీజన్ వైఫల్యాన్ని చవిచూసింది. 2020 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గొప్ప ఆరంభాన్ని పొందింది. మొత్తం 7 మ్యాచ్‌లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. కానీ, ప్రస్తుతం యూఏఈ సవాలు మరోసారి ఈ జట్టు ముందు ఉంది. ధోనీ జట్టు గత సీజన్‌లో యూఏఈలో అత్యంత ఘోరమైన దశను ఎదుర్కొంది. మొదటిసారి ప్లేఆఫ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఏదేమైనా, జట్టు ఈసారి మెరుగ్గా తయారైనట్లు కనిపిస్తోంది.

ప్లేయింగ్ ఎలెవన్
చెన్నై సూపర్ కింగ్స్ XI: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్/రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోనీ, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్‌గిడి, దీపక్ చాహర్

ముంబై ఇండియన్స్ XI: క్వింటన్ డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, కీరాన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, రాహుల్ చాహర్, నాథన్ కౌల్టర్-నైల్/ఆడమ్ మిల్నే/జయంత్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Also Read: IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?

IPL 2021: షార్జాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి నో ఎంట్రీ.. RT-PCR టెస్ట్‌ రిజల్ట్ కచ్చితం..