IPL 2021 FInal, CSK vs KKR: కింగ్‌ ఖాన్‌ను వదలని సన్ స్ట్రోక్.. ఫైనల్‌కు దూరం.. ఆయన కోసం ట్రోఫీ గెలుస్తామంటోన్న ఆటగాళ్లు

|

Oct 15, 2021 | 4:58 PM

CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుక్ ఖాన్ ప్రస్తుతం చాలా బాధలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలోకూడా మౌనం వహిస్తున్నాడు.

IPL 2021 FInal, CSK vs KKR: కింగ్‌ ఖాన్‌ను వదలని సన్ స్ట్రోక్.. ఫైనల్‌కు దూరం.. ఆయన కోసం ట్రోఫీ గెలుస్తామంటోన్న ఆటగాళ్లు
Ipl 2021 Final, Csk Vs Kkr, Shah Rukh Khan
Follow us on

IPL 2021 FInal, CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుక్ ఖాన్ ప్రస్తుతం చాలా బాధలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలోకూడా మౌనం వహిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీకి దూరం అయ్యాడు. మాములుగా అయితే కింగ్ ఖాన్ తరచూ తన బృందాన్ని స్టాండ్‌లో నుంచి ఉత్సాహపరుస్తూ ఉంటాడు. కానీ, ప్రస్తుతం తన కుటుంబం ఎంతో బాధలో ఉండడంతో షారుక్ జట్టుకు దూరంగా ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, టీం మేనేజ్‌మెంట్‌తో మాత్రం టచ్‌లో ఉన్నాడంట. వాస్తవానికి ఈ రోజు ఇయాన్ మోర్గాన్ జట్టు ట్రోఫీని గెలిస్తే, అది కింగ్ ఖాన్‌కు సంతోషకరమైన విషయమే.

కేకేఆర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, షారుక్ ఖచ్చితంగా దుబాయ్‌కు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. జట్టును ఉత్సాహపరిచేందుకు ఆయన స్టాండ్‌లలో ఉండకపోవడం నిజంగా విచారకరం. ముఖ్యంగా ఇది మాకు అనుకూలంగా ఉన్న సీజన్. సాధారణ పరిస్థితులలో షారుఖ్ దుబాయ్‌కు వచ్చేవారు. అయితే సీనియర్ అధికారులతో టచ్‌లోనే ఉండి, పరిస్థితులను తెలుసుకుంటున్నాడు. ఆటగాళ్లతో దూరంగా ఉండోచ్చు. కానీ, ఆయన మద్దతు మాకు ఉంటుంది’ అని తెలిపాడు.

షారుక్ కోసం ఆడనున్న నైట్ రైడర్స్
‘ఇది సరైన నిర్ణయమే. అటువంటి క్రీడా ప్రేమికుడు ఫైనల్‌కు దూరంగా ఉండటం కష్టం. కానీ, ఒక్క ట్వీట్ కూడా వారిని లైమ్‌లైట్ నుంచి దూరం చేస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న వాటి నుంచి ఆటగాళ్లు దృష్టిని కోల్పోతారు. ఆటగాళ్లు అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. షారుక్ ఎంత మక్కువతో ఉన్నారో ఆటగాళ్లకు తెలుసు. అందుకే తమ వంతు ప్రయత్నంగా షారుక్ కోసం నేడు ఫైనల్‌లో ఆడతారు’ అని ఆ అధికారి పేర్కొన్నాడు.

టోర్నమెంట్‌లో చివరి మ్యాచ్ అంటే ఫైనల్ ఈరోజు దుబాయ్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. మరోవైపు సీఎస్‌కే నాల్గవ సారి టైటిల్ గెలుచుకోవడానికి రెడీ అవ్వగా, కోల్‌కతా టీం మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించేందుకు దృష్టి సారించింది.

Also Read: MS.Dhoni: నెట్స్‎లో చెమటోర్చిన ఎంఎస్ ధోనీ.. ఫైనల్లో హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్ గెలిపిస్తాడా..

IPL 2021 final: ఫైనల్ చేరడంలో ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు.. మరి ఫైనల్‎లో వారు ఎలా ఆడతారో..