IPL 2021 Auction Date: ఐపీఎల్ వేలానికి సమయం ఆసన్నమైంది.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?

|

Feb 16, 2021 | 2:02 PM

రోజులు దగ్గరికి వస్తున్నాయ్. ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలం పాటకు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి  18న  ఆటగాళ్ల వేలం జరగనున్న విషయం తెలిసిందే.  

IPL 2021 Auction Date: ఐపీఎల్ వేలానికి సమయం ఆసన్నమైంది.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..?
Follow us on

IPL auction date feb : రోజులు దగ్గరికి వస్తున్నాయ్. ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలం పాటకు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి  18న  ఆటగాళ్ల వేలం జరగనున్న విషయం తెలిసిందే. 18వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుంది.  చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా లీగ్‌ను నిర్వహించగా.. అభిమానులు కాస్త అప్‌సెట్ అయ్యారు. కానీ ప్రస్తుతం మహమ్మారి ప్రభావం తగ్గింది. వ్యాక్సీన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈసారి  స్వదేశంలో మ్యాచ్‌లు జరపడంతో పాటు ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

కాగా ఎనిమిది ఫ్రాంచైజీలు.. ఆటగాళ్లను రిలీజ్‌ చేసే గడువు జనవరి 20తోనే ముగిసిపోయింది. మ్యాక్స్‌వెల్‌, మోరిస్‌, స్టీవ్‌ స్మిత్‌, హర్భజన్‌ సింగ్‌, ఫించ్‌ సహా 57 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో 61 మంది ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Also Read:

నిమ్మర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..

దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకుపైనే తల్లి పైశాచికం.. బ్లేడుతో…