Babar Azam vs Shahid Afridi: బాబర్ అజాంకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి ఔట్.. స్కెచ్ గీసిన షాహిద్ అఫ్రిదీ..

|

Apr 10, 2023 | 8:50 PM

Pakistan Cricket Team: షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ బాబర్ అజామ్‌ను తొలగించాలని భావిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Babar Azam vs Shahid Afridi: బాబర్ అజాంకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి ఔట్.. స్కెచ్ గీసిన షాహిద్ అఫ్రిదీ..
Babar Azam
Follow us on

పాకిస్థాన్ క్రికెట్‌లో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిసార్లు ఈ వివాదాలు ఫీల్డ్‌లో పుట్టుకొస్తుంటాయి. కొన్నిసార్లు అవి ఫీల్డ్ వెలుపల నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు మరోసారి పాకిస్థాన్ క్రికెట్‌లో పెద్ద వివాదానికి దారితీసింది. బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ కోరినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ వెల్లడించారు.

షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని తాత్కాలిక సెలక్షన్ కమిటీ కమాండ్ తీసుకున్న వెంటనే, బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం గురించి మాట్లాడినట్లు నజం సేథి ఒక యూట్యూబ్ ఛానెల్‌తో సంభాషణలో తెలిపారు. నజామ్ సేథీ ప్రకారం, పాక్ జట్టులో మార్పు అవసరమని, బాబర్‌ను కెప్టెన్‌గా తొలగించాల్సిన అవసరం ఉందని సెలక్షన్ కమిటీ పేర్కొంది.

పెద్ద టోర్నీలు, సిరీస్‌లు గెలవలేకపోయిన బాబర్ ఆజం..

బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ పెద్ద సిరీస్ లేదా టోర్నమెంట్‌ను గెలవలేకపోయింది. ఆసియాకప్‌ ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్‌ ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఇదొక్కటే కాదు, బాబర్ అజామ్ జట్టు తమ సొంత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కూడా పాకిస్థాన్ 0-1 తేడాతో కోల్పోయింది. ఈ జట్టు న్యూజిలాండ్‌పై స్వదేశంలో సిరీస్‌ను గెలవలేకపోయింది. బాబర్ అజామ్ ఏ టోర్నీని గెలవలేదని లేదా పాకిస్తాన్ పెద్ద జట్టుపై స్వదేశంలో టెస్ట్ సిరీస్ గెలవలేదని స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..