Sanju Samson : కేరళ బంగ్లా నుంచి హైదరాబాద్ ఫ్లాట్ల వరకు.. సంజూ శాంసన్ ఆస్తుల చిట్టా వింటే దిమ్మతిరగాల్సిందే

Sanju Samson : టీమిండియాలో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతాడో తెలియదు కానీ, కేరళ కుట్టి సంజూ శాంసన్ రేంజ్ మాత్రం మామూలుగా లేదు. మైదానంలో క్లాస్ షాట్లతో అలరించే ఈ వికెట్ కీపర్ బ్యాటర్, బయట కూడా అంతే క్లాస్‌గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు.

Sanju Samson : కేరళ బంగ్లా నుంచి హైదరాబాద్ ఫ్లాట్ల వరకు.. సంజూ శాంసన్ ఆస్తుల చిట్టా వింటే దిమ్మతిరగాల్సిందే
Sanju Samson Property

Updated on: Dec 20, 2025 | 11:30 AM

Sanju Samson : టీమిండియాలో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతాడో తెలియదు కానీ, కేరళ కుట్టి సంజూ శాంసన్ రేంజ్ మాత్రం మామూలుగా లేదు. మైదానంలో క్లాస్ షాట్లతో అలరించే ఈ వికెట్ కీపర్ బ్యాటర్, బయట కూడా అంతే క్లాస్‌గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు. అనవసరమైన హడావుడి లేకుండా, సైలెంట్‌గా కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ అక్షరాలా 85 కోట్ల రూపాయలు అని సమాచారం.

సంజూ శాంసన్ కు కేరళలోని తిరువనంతపురంలో ఒక అద్భుతమైన బంగ్లా ఉంది. దీని విలువ సుమారు 6 కోట్ల రూపాయలు. ఈ ఇల్లు కేరళ సాంప్రదాయం, ఆధునిక హంగుల కలయికతో ఉంటుంది. ముఖ్యంగా ఓనమ్ పండుగ సమయంలో భారీ పూల ముగ్గులు వేసుకునేంత ఖాళీ స్థలం, పచ్చని ప్రకృతి మధ్య ఈ ఇల్లు ఉండటం విశేషం. కేవలం కేరళలోనే కాదు, సంజూకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి. క్రికెట్ కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి, ముందు చూపుతో సంజూ ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక సంజూ కార్ల సేకరణ విషయానికి వస్తే.. అతని దగ్గర ఒక లగ్జరీ గ్యారేజ్ ఉంది. ఇందులో 56 లక్షల రూపాయల విలువైన లెక్సస్ సెడాన్ కార్ చాలా ప్రత్యేకమైనది. దీనితో పాటు 1.8 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి A6, బీఎండబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి ఖరీదైన కార్లు అతని దగ్గర ఉన్నాయి. చాలా మంది క్రికెటర్లు హడావుడి చేసే కార్లు కొంటే, సంజూ మాత్రం కంఫర్ట్, రాయల్ లుక్ ఉన్న కార్లనే ఎక్కువగా ఇష్టపడతాడు.

సంజూ శామ్సన్ సంపాదనలో సింహభాగం ఐపీఎల్ నుంచే వస్తుంది. 2012లో కేవలం 18 లక్షలతో మొదలైన అతని ప్రయాణం, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా 18 కోట్ల రూపాయల వార్షిక వేతనానికి చేరుకుంది. ఐపీఎల్ ద్వారానే అతను ఇప్పటివరకు సుమారు 95 కోట్లు ఆర్జించాడు. దీనికి తోడు బీసీసీఐ నుంచి ఏటా ఒక కోటి రూపాయల కాంట్రాక్ట్ ఫీజు, మ్యాజ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. తన చిన్ననాటి స్నేహితురాలు చారులతను పెళ్లి చేసుకున్న సంజూ, ఆడంబరాలకు దూరంగా ఉంటూనే ఒక రాజులాంటి జీవితాన్ని గడుపుతున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..