Mumbai Indians : ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్..ఇంత నడిచిందా ?

Mumbai Indians : ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో, మాజీ క్రికెటర్ల నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే మైదానం బయట ఎన్ని విమర్శలు ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అశ్విని కుమార్ వెల్లడించారు.

Mumbai Indians : ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్..ఇంత నడిచిందా ?
Mumbai Indians

Updated on: Apr 21, 2026 | 11:29 AM

Mumbai Indians : ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్ (MI), ఎట్టకేలకు గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసి ఊపిరి పీల్చుకుంది. తిలక్ వర్మ మెరుపు సెంచరీ, అశ్విని కుమార్ అద్భుత బౌలింగ్‌తో ముంబై మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. అయితే, నాలుగు వరుస ఓటముల తర్వాత కూడా జట్టు ఇంత బలంగా ఎలా పుంజుకోగలిగింది? అసలు ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది? ఈ సీక్రెట్లను ఆ జట్టు బౌలర్ అశ్విని కుమార్ స్వయంగా వెల్లడించారు.

ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో, మాజీ క్రికెటర్ల నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే మైదానం బయట ఎన్ని విమర్శలు ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అశ్విని కుమార్ వెల్లడించారు. “మేము గెలిచినా, ఓడినా మా డ్రెస్సింగ్ రూమ్‌లో కేవలం పాజిటివ్ మాటలే వినిపించేవి. హార్దిక్ భాయ్ జట్టును ఎప్పుడూ కుంగిపోనివ్వలేదు. తిలక్ కచ్చితంగా కొడతాడని, మేము గెలుస్తామని మాకు ముందే తెలుసు” అని అశ్విని తెలిపారు.

ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విని కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి గుజరాత్ టైటాన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 24 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసిన అశ్విని, తన సక్సెస్ వెనుక ఉన్న ప్లాన్ గురించి మాట్లాడాడు. “నేను ముందే గుజరాత్ బ్యాటర్ల గురించి స్టడీ చేశాను. వికెట్ ఎలా స్పందిస్తుందో గమనించి, కెప్టెన్ హార్దిక్‌తో చర్చించాను. మేము అనుకున్న వ్యూహాన్ని సరిగ్గా అమలు చేశాం. శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ వంటి కీలక వికెట్లు తీయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై విజయంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ, హార్దిక్ పాండ్యా మధ్యలో వచ్చి తిలక్ తో సీరియస్ గా మాట్లాడటం, ఆ తర్వాత తిలక్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేయడం సంచలనం సృష్టించింది. 99 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడించడంలో తిలక్ కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన ముంబై, ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us